Tuesday, May 14, 2024

భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ లోఉత్సాహం

తప్పక చదవండి
  • తెలంగాణాలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
  • ఏఐసీసీ నేత, రాజ్యసభ సభ్యులు జైరాం రమేశ్

మహబూబ్ నగర్ : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందని ఏఐసీసీ అగ్రనేత, రాజ్యసభ సభ్యులు జైైరాం రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ జొడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఒక శక్తి ఇచ్చిందన్నారు. భారత్ జోడోయాత్ర తర్వాత కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని, ఈ పార్టీలతో ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినట్లు తెలిపారు. తెలంగాణ బిల్లు లోకసభలో ప్రవేశపట్టినప్పుడూ ఎక్కడికి వెళ్లినట్లు ప్రశ్నించారు. పదేళ్ల తర్వాత చూస్తే తెలంగాణాలో కేసీఆర్ కుటుంబానికి లాభం కలిగిందని, ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం జరగలేదన్నారు. ఒక కుటుంబం చేతుల్లోనే ప్రధాన మంత్రితత్వశాఖలు ఉన్నాయని ఆరోపించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం . ఎక్కువగా ఉందని, దేశంలో 10 శాతం ఉంటే తెలంగాణలో 15 శాతం ఉందన్నారు. యువకుల ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్లలో గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం ఎంతవరక సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణాలో ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. సామాజిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని తెలిపారు. మహిళలకు నెలకు రూ.2500లు, రూ.500 సిలిండర్, రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15వేలు, కౌలు రైతులకు రూ.12వేలు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఉపాదీ హామీ పథకం వల్ల వలసలు ఆగినట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు మోహన్ కుమార్ మంగళం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సిజే బెనహర్ , మధుసూదన్ రెడ్డి, సిరాజ్ భఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు