Monday, April 29, 2024

రాజీనామాలకు ఆమోదం

తప్పక చదవండి
  • టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు
  • ఆమోదించిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌
  • కొత్త సభ్యుల నియామకానికి లైన్‌ క్లియర్‌
  • త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం

హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్‌ పదవికి జనార్థాన్‌ రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం ఒక్కొక్కరిగా సభ్యుల రాజీనామా చేస్తూ వచ్చారు. తమ రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపించారు. అప్పటి నుంచి ఈ రాజీనామాలు గవర్నర్‌ వద్దే పెండిరగ్‌ లో ఉన్నాయి. తాజాగా వాటిని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియమాకానికి లైన్‌ క్లియర్‌ అయింది. కొత్త సభ్యుల నియమాకం తరువాత జాబ్‌ నోటిఫికేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చైర్మన్‌, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై బుధవారం ఆమోదించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్‌ చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కోరారు. ఆ మేరకు గవర్నర్‌ తమిళిసైకి ఆయన లేఖ రాశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా.. గవర్నర్‌ వాటిని ఇంత వరకు ఆమోదించడం లేదని అన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ బుధవారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు