Wednesday, May 8, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అమ్మా నువ్వు మా నుంచి దూరమై
అప్పుడే ఏడాది గడిచిపోయిందా…?
ఇంటికి వచ్చిన ప్రతిసారీ ‘బిడ్డా’
అన్న అప్యాయపు పిలుపు విని
యుగాలయినట్టు అనిపిస్తుంది.
బిడ్డా అన్నం తింటావా అని
పిలుస్తావని రోజూ ఎదురు
చూస్తూనే ఉన్న అమ్మ.
నేను పనిలోపడి… నన్ను
ఈ లోకాన్నే మర్చిపోతే …
ఇంటికి ఇంకా రాలేదు
సుదర్శన్‌ అని నువ్వు ఎవ్వరితోనయినా
ఫోన్‌ చేయించే ఆ రోజుల కోసం ఇంకా
ఎదురు చూస్తూనే ఉన్న. నన్ను నా
ఎదుగుదలను చూసి మురిసిపోతుంటే
నీ కళ్ళలో ఆనందం చూసిన ఆ క్షణాలను
నేను మరువలేకున్నాను…
కల్మషం లేని కమ్మని మనసు…
ప్రేమను పంచే నీ చల్లని చూపు…
అమాయకత్వపు అనురాగాల కల్పవల్లి
నన్నుగన్న నా తల్లి… ఓర్పును నేర్పిన
అమృతమూర్తి మా అమ్మ. మీ పెంపకం
ఉన్నత విలువలు నేర్పింది.
ఇంత గొప్ప మనసున్న అమ్మా…
నా కోసం మళ్ళీ రావా…?

  • సిద్ధగౌని సుదర్శన్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు