Friday, May 3, 2024

కుంగిపోతున్న న్యూయార్క్‌ పట్టణం

తప్పక చదవండి
  • ఏటా 1.6 మిల్లీ మీటర్లు భూమిలోకి కుంగిపోతోంది..
  • అధ్యయనం చేస్తున్న రుట్జర్స్‌ యూనివర్సిటీ..
  • ఎర్త్‌ మాంటిల్‌ సర్దుకుపోవడం కారణంగానే ఈ పరిస్థితి..

న్యూయార్క్‌ : న్యూయార్క్‌ సిటీ భూమిలోకి కూరుకుపోతోందట.. ప్రతి ఏటా సుమారు 1.6 మిల్లీ విరీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడ్కెంది. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ, రుట్జర్స్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం చేశారు. 2016 – 2023 మధ్యకాలంలో పరిశోధకులు రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నిక్‌ సాయంతో దీనిపై అధ్యయనం చేశారు. ఇంటర్‌ఫెరోమెట్రిక్‌ సింథటిక్‌ అపాచ్యుర్‌ రాడార్‌ (ఐఎన్‌ఎస్‌ఏఆర్‌) టెక్నాలజీతో భూ కదలికల (వర్టికల్‌ ల్యాండ్‌ మోషన్‌)పై అధ్యయనం చేశారు. నిర్మాణాలు, పునరుద్ధరణ పనులతో పాటు సహజ సిద్ధమైన కొన్ని కారణాల వల్ల భూమి కుంగిపోతున్నదని పరిశోధకులు గుర్తించారు. ఎర్త్‌ మాంటిల్‌ సర్దుకుపోవడం కారణంగా కూడా ఈ పరిణామం జరుగుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నగరంలోని లాగార్డియా విమానాశ్రయంలోని ఓ రన్‌వే ఏటా 3.7 మిల్లీ విరీటర్లు, ఆర్థర్‌ యాష్‌ స్టేడియం 4.6 మిల్లీ విరీటర్ల మేర కుంగిపోతున్నది. మరోవైపు విలియమ్స్‌బర్గ్‌, బ్రూక్లిన్‌, వుడ్‌సైడ్‌, క్వీన్స్‌ తదితర ప్రాంతాలు ఏటా 1.6` 6.9 మిల్లీ విరీటర్ల వరకు భూమి పైకి చొచ్చుకొస్తున్నాయి. అయితే దీనికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు