Monday, May 13, 2024

909 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు

తప్పక చదవండి
  • డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు..

హైదరాబాద్ : ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, త‌దిత‌ర పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లు సంయుక్తంగా ప్ర‌క‌టన విడుద‌ల చేశాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 909 భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభంకాగా అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు : 909.. ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, త‌దిత‌రాలు.. అర్హ‌త‌లు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపిక : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వార.. దరఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు.. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో.. చివరి తేదీ: అక్టోబ‌ర్ 25.. వెబ్‌సైట్ : vmmc-sjh.nic.in

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు