Tuesday, April 30, 2024

జాతీయ నాయకుల త్యాగాలు, నేటి యువతరానికి తెలియ జేయాలి

తప్పక చదవండి
  • పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ కు విముక్తి ప్రసాదించిన నాటి ప్రధాని, ఇందిరాగాంధీ
  • శతృ దేశంతో జరిగిన అరివీర భయంకర యుద్ధంలో గెలిచి దుర్గామాత అని ప్రశంసలు పొందిన ఇందిరాగాంధీ
  • నాటి త్యాగధనుల జీవితాలను నేటి తరానికి తెలియజేయ వలసిన బాధ్యత మనపై వుంది.
  • కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ గా పిలవబడిన బంగ్లాదేశ్ అవతరించింది. భారతీయ సైనిక దళాలు వీరోచితంగా పోరాడి బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించారు. ప్రపంచ దేశాల ముందు బారత్ ఒక బలమైన శక్తిగా నిరూపించుకుంది ఇదంతా ఒక మహిళ ఉక్కు సంకల్పంతో 1971 లో పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఇందిరాగాంధీ అపర దుర్గామాతలా విజృంభించి పాకిస్థాన్ పై విజయం సాధించారని ప్రతిపక్షంలో వున్న వాజ్‌పేయి ఆమెను ప్రశంసిండం చరిత్రలో నిలిచిపోయిందని డప వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచంలో అతి తక్కువ కాలం జరిగిన యుద్ధంలో భారత్ సైన్యం విజయం సాధించిప కాంగ్రెస్ పార్టీ అధినాయకులు చేసిన త్యాగాలు, వారి వీరోచిత గాథలను నేటి యువతరానికి వివరించాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి ఇందిరా భవన్ లో శనివారం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971 విజయోత్సవాలపై సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిధిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్, తెలంగాణ దళిత కాంగ్రెస్ ఛైర్మన్ నాగరిగారి ప్రీతమ్ కుమార్, కుమార్ రావ్, నాయకులు కోదండ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, నీలిమ, జితేందర్, చల్లా నర్సింహా రెడ్డి, మెట్టు సాయి కుమార్, పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు