Tuesday, May 7, 2024

పోరుబాటకు సిద్ధమైన బీజేపీ

తప్పక చదవండి
  • మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అవినీతిపై పోరాడండి
  • కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అవినీతి, అరాచకాలపై రోడ్డెక్కండి
  • కొండగట్టు, వేములవాడ ఆలయాలకు నిధుల హామీపైనా ఉద్యమించండి
  • బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో కలపాలంటూ ప్రజలతో కలిసి పోరాడండి
  • బీజేపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చిన బండి సంజయ్ కుమార్
  • ప్రజల ఛీత్కారానికి గురైన బీఆర్ఎస్ ను తరిమికొట్టేదాకా పోరాడండి..

కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్ సహా పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పోరాటం చేేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో పాలక బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై రోడ్డెక్కి పోరాటాలు చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆయా నేతల అవినీతి, అక్రమాల చిట్టాను 2, 3 రోజుల్లో వెలికి తీయాలని కోరారు. శనివారం కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్స్ లో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారులతో సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ పోరాట కార్యక్రమాలను వివరించారు.

‘‘కరీంనగర్ కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో పాలక బీఆర్ఎస్ నేతల అరాచకాలు, అవినీతి పెచ్చుమీరిపోయింది. ప్రభుత్వ సొమ్మును దోచుకోవడంతోపాటుప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా పీడించుకుతింటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ నేతల అవినీతికి అంతులేకుండా పోయింది. స్మశాన వాటికలో యంత్రాల ద్వారా గడ్డి పీకాలని చెప్పి దొంగ బిల్లులు పెట్టి రూ.12 లక్షలు దోచుకున్నరు. బిల్లులో ఓ వాహనం నెంబర్ రాశారు.. ఆరా చూస్తే అది బైక్ అని తేలింది. వాళ్ల అవినీతికి ఇదొక మచ్చు తునక. ఇట్లాంటివెన్నో ఉన్నాయి. భూముల కబ్జాలకు అడ్డుఅదుపు లేదు. రెండు, మూడు రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్ సహా బీఆర్ఎస్ కార్పొరేటర్ల అవినీతి, అక్రమాలపై పూర్తి వివరాలు తెప్పించుకోండి. మనం చేసే పోరాటాలతో బీఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పట్టాలి.’’అని సూచించారు.

- Advertisement -

‘‘అట్లాగే చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడసహా పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లోని అవినీతిపై పోరాటాలు చేయాలని కోరారు. ‘‘అక్కడ పెత్తనం చెలాయిస్తున్న వాళ్లంతా బీఆర్ఎస్ నేతలే… వారి అవినీతి బండారాన్ని బయటపెట్టండి… మానకొండూరులో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు..దీనిపై పోరాటం చేయాలి. ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించేలా చేయాలి. ప్రజల పక్షాన నిలవాలి. దీంతోపాటు కొండగట్టు ఆలయానికి ఇస్తానన్న నిధులేమయ్యాయని పోరాటం చేయాలి. కేసీఆర్, కవిత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి. అవినీతి, అరాచకాలతో చెలరేగి ప్రజలను దోచుకుతిన్న బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తరిమికొట్టాల్సిన అవసరం ఉంది… ఎక్కడా రాజీపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి హామీలు అమలు చేయడానికి కొంత సమయం ఇద్దాం’’అని చెప్పారు. బెజ్జంకిని కరీంనగర్ లో కలపాలన్నది ప్రజల డిమాండ్. దీనికోసం బీజేపీ కార్యకర్తలంతా ప్రజల పక్షాన పోరాడుతూ రోడ్డెక్కాలని పిలుపునిచ్చారు.

‘‘బీజేపీకి ప్రత్యర్థులైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై పోరాడాలి. ఈ విషయంలో పార్టీ నాయకులంతా అంతర్గత విబేధాలను పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకుసాగాలి. ప్రజల పక్షాన ఉద్యమించాలి. అట్లాగే ప్రతి కార్యకర్త ఓటరు నమోదు కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇంటింటికీ తిరిగి కొత్త ఓటర్లను చేర్పించాలి.’’ అని సూచించారు.

వచ్చేనెల తొలివారంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో కరీంనగర్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని బండి సంజయ్ చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల జాబితాను రూపొందించి పంపాలని, వారందరినీ ఆత్మీయ సమ్మేళానికి ఆహ్వానించాలని కోరారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందులో భాగంగా ప్రతిరోజు మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు