Tuesday, May 14, 2024

వరుసగా ఐదోయేడూ వైఎస్సార్‌ రైతుభరోసా

తప్పక చదవండి
  • రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయం విడుదల
  • బటన్‌ నొక్కి అందచేసిన సిఎం జగన్‌
  • రైతు సంక్షేమం కోసం తపన పడుతున్న జగన్‌
  • మంత్రులు కాకాణి, అప్పలరాజుల కితాబు

అమరావతి : వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా… కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు(సీసీఆర్సీలు) పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైఎస్సార్‌ రైతు భరోసాను జగన్‌ అందచేశారు. ఇందుకు సాయంగా రూ.109.01 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ జమ చేసారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి మాట్లాడుతూ…వైఎస్సార్‌ రైతు భరోసా,పీఎం కిసాన్‌ పథకం 2019 నుంచి ప్రారంభించి ఐదేళ్ళు సమర్ధవంతంగా సీఎం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామని అన్నారు. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రూ. 50 వేల సాయాన్ని రూ. 67,500 చేయడం అందరికీ తెలిసిందే, ఈ ఘనత సీఎందేనని అన్నారు. అదే విధంగా కౌలు రైతులకు సంబంధించి కూడా క్రమం తప్పకుండా సాయం చేయడం, 109.74 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఉద్యానవన పంటలకు సంబంధించి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా రూ. 11.01 కోట్లు ఈ రోజు జమ చేయడం జరుగుతుంది. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకువచ్చి పంటలు దెబ్బతిన్న రైతులకు సీజన్‌ ముగిసేలోపే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలనే మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా సీఎంనెరవేరుస్తున్నారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లిస్తూ రైతులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు సమర్ధవంతంగా, సంపూర్ణంగా సీఎం అమలు చేస్తున్నారు, దాని వలన సగటున 14 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి చేసుకునే పరిస్ధితికి వచ్చాం, ఇదంతా కూడా రైతుల అభివృద్ది, రైతుల సంక్షేమం, రైతు శ్రేయస్సు కాంక్షించి సీఎం తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని కాకాణి అన్నారు. ప్రజలు, రైతులు కూడా నవ్వు మొహంతో ఉండాలని ఆకాంక్షించే సీఎంకి అందరితో పాటు రైతుల ఆశీస్సులు కూడా ఉండాలని కోరారు. మంతరి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ… నాడు ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా ఆలోచన గొప్పదని, అదే ఆలోచనతో తెలంగాణ కూడా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అదే ఆలోచనతో ప్రధాని కూడా పీఎం కిసాన్‌ దేశవ్యాప్తంగా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. సీఎం ఆలోచన రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం కూడా దీనిని అమలుచేసేలా విూరు ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క రైతు భరోసానే కాదు అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు రాబోయే రోజుల్లో దేశ అభివృద్దిని ముందుకు తీసుకెళ్ళడంలో గొప్ప పాత్రను పోషిస్తాయి, ధన్యవాదాలు.రాధాకృష్ణ, రైతు, గురజాపులంక, బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాజగనన్నా నమస్తే, గతంలో భారీ వరదల వల్ల మా పంటలు దెబ్బతిన్నాయి, విూరు మా గ్రామంలో ప్రతి ఇంటకి తిరిగి, ప్రతి పంట పరిశీలించారు. ఆ రోజే విూరు మాట ఇచ్చారు, విూరు నష్టపోయిన పరిహారం వెంటనే ఇస్తామన్నారు, దాని ప్రకారం ఈ రోజు సాయం చేస్తున్నారు, విూకు ధన్యవాదాలు అన్నా, ఈ సాయం మాకు రెండో పంట వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆర్బీకేల ద్వారా మాకు అన్నీ అందుతున్నాయి, మాకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి, మేం యంత్రసేవా పథకం ద్వారా కూడా లబ్దిపొందుతున్నాం, మా లంక గ్రామాలు పరిశీలించి విూరు సాయం చేయడం మరిచిపోలేం, మా గ్రామాల అందరి తరపునా విూకు ధన్యవాదాలు, విూ పథకాలు అన్నీ అందుతున్నాయి, మాకు ఈ నాలుగేళ్ళలో రూ. 5 లక్షల సాయం పొందాను, మా గ్రామల్లో రివిట్‌మెంట్‌ కట్టించి కోతకు గురికాకుండా చేస్తామన్నారు, అది కూడా పూర్తయితే మా లంక గ్రామాల ప్రజలు మిమ్మల్ని దేవుడిలా చూసుకుంటారరని రైతులు అన్నారు. 40 ఏళ్ళుగా చూస్తున్నాను ఏ ప్రభుత్వం కౌలు రైతులకు సాయం చేయలేదు, కానీ విూరు సాయం చేస్తున్నారు, పంటకు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి సాయం చేస్తుంది, గతంలో ఎవరూ చేయని విధంగా వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు, నాడు నాన్నగారు ఇప్పుడు విూరు రైతులను ఆదుకుంటున్నారు, విూరు చిరకాలం సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం, మార్కెటింగ్‌,సహకార, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఏపి అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, ఉద్యానవనశాఖ సలహాదారు పి.శివ ప్రసాద్‌రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్‌, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) చిరంజీవి చౌదరి, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌ హరికిరణ్‌, ఉద్యానవనశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్‌, ఏపీ విత్తనాభివృద్ధిసంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ అమరేంద్ర కుమార్‌, ఏఎన్‌జిఆర్‌ఏయూ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ ఎల్‌ ప్రశాంతి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు