Sunday, October 6, 2024
spot_img

అద్దరగొట్టిన సూరత్‌ కళాకారుడు..

తప్పక చదవండి
  • 5 వేల వజ్రాలు, 2 కిలోల వెండిని ఉపయోగించి రామాలయం థీమ్‌పై నెక్లెస్‌ తయారి..
  • 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం
  • చూపరులను ఆకట్టుకుంటోన్న ఈ అరుదైన డిజైన్‌
  • దీనిని రామమందిర్‌ ట్రస్టుకు బహుమతిగా అందజేత

హైదరాబాద్‌ : గుజరాత్‌లోని సూరత్‌ అనగానే గుర్తొచ్చేది ఖరీధైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతిని రూపొందించారు. దాన్ని చేసింది స్వచ్ఛమైన వజ్రాలతో.. అవి కూడా ఒకటి తక్కువ 10 వేల వజ్రాలతో.ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లటి అట్టపై ఈ వజ్రాలను వరుసగా పేర్చి అయోధ్య రామమందిరంతో కూడిన శ్రీ రాముడి కళాకృతిని డిజైన్‌ చేశారు. పైన జై శ్రీ రామ్‌ అని రాసి ఉంది. ఇది చూపరులను ఆకట్టు కుంటోంది. నగరంలోని ఒక వజ్రాల వ్యాపారి 5 వేల వజ్రాలు, 2 కిలోల వెండిని ఉపయోగించి రామాలయం థీమ్‌పై నెక్లెస్‌ను కూడా తయారు చేశాడు.దీనిని రామమందిర్‌ ట్రస్టుకు బహుమతిగా ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవిత్రమైన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఇతర ప్రముఖుల సమక్షంలో జనవరి 22న జరగనుంది. ఆలయ ట్రస్ట్‌ 7 వేల మందికి పైగా ప్రముఖులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు