Sunday, May 19, 2024

aaj ki baath

ఆజ్ కి బాత్..

ఓ ప్రజాస్వామ్యమా నీవెక్కడ దాక్కున్నావమ్మ..?రాజాకార్ పాలనలో జీవితాలను బంధీ చేస్తున్నా..ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నా..బతుకులను కాలరాస్తున్నా..వారికే అధికారం కట్టబెడుతన్నావా..?ఈ స్వేచ్ఛా రాష్ట్రంలో జర్నలిస్టులపైనేదాడులు జరుగుతుంటే..ఇక నీ ఉనికికై పోరాడేదెవరమ్మా..?ఇకనైనా మేలుకో ప్రజాస్వామ్యమా..నీ విలువను చూపించు..రాష్ట్రంలో నిరంకుశ పాలనను త్యజించు..! మొగిలి ఉదయ్ కిరణ్..

ఆజ్ కి బాత్..

దేన్నైనా మోయడం దుఃఖమేకదా..నాలోని అవస్థ నన్ను కౌగలించుకుని,దుఃఖపు గ్లుసుల్ని పెనవేస్తూ ఉంటే..నగరం నిద్రలో ఊగిసలాడుతోంది..చివరి నిద్ర నన్ను తరుముకుంటూ, తవ్వుకుంటూ..నా గుండెల మీద పిడిబాకుల కవాతు చేస్తున్నట్లుంది..నాకే అర్ధం కానీ మరేదో బాధ..నన్ను శూన్యంలోకి విసిరేస్తోంది..దుఃఖాన్ని దిగమింగుతూ..ఈ మట్టిపొరల క్రింద నా ఊపిరి ఇంకానవ్వుతోంది.. ఎదో జరగాల్సి వుంది..మరోలా నేను లేవాలని నా మనసుఆరాట...

ఆజ్ కి బాత్

రాజ్యం నీ తల రాత మార్చదు..రాజ్యాంగం నీ జీవితాన్నిమార్చగలదు..హక్కులను అణిచినప్పుడుఅడుగుతుంది..అక్షరాన్ని బంధించినప్పుడుబలమౌతుంది..అధికారం అండతో ఆగడాలు చేస్తేఅరికడుతుంది..అన్ని కులాలకు, మతాలకుపవిత్రమైన గ్రంథం రాజ్యాంగం..ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగారాజ్యాంగం చదవాలి..భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.. సుమన్

ఆజ్ కి బాత్..

వానాకాలం సీజన్ దాటిపోతుంది..రైతులను కరువు చీకట్లు కమ్ము కుంటున్నయి..విత్తులు నాటి ఆకాశం వైపు చూస్తున్నారు..చినుకు పడదు.. విత్తు మొలకెత్తదు..అతివృష్టి, అనావృష్టులు రైతులను ముంచుతున్నయి..సేవ పేరుతో నేతలై స్వార్థం కోసం ఏడ్చే కండ్లుమురికి గుంటల కన్న హీనం..తుదకు.. మురికి నీరైనా కాలే మంటలను ఆర్పగలవు..నేతల స్వార్థ పూరిత కన్నీటి నటన కాదు?అన్నం పెట్టే రైతున్నల ఆత్మహత్యలు...

ఆజ్ కి బాత్..

గంజాయి బంజేయ్యి ఓ బిడ్డనా గుండె బరువైతందిరా నా బిడ్డ…కారం మెతుకులు తిని కడుపునింపుకొనినిన్ను కన్నానురా ఓ బిడ్డ..నా నెత్తురు కరిగించి చనుభాలలోపాలబోట్లయి నీ ఆకలి తీర్చినరా ఓ బిడ్డ..మాయదారి మత్తులో పడి మట్టిలోకలిసిపోకు రా నా బిడ్డ..దేశానికీ ఓ సైనికున్ని చేస్తా అనికలలు కన్నా ఓ బిడ్డ..పచ్చని గ్రామాల్లోకి గంజాయి డ్రగ్స్దాపురించి దహించి...

ఆజ్ కి బాత్..

పంట నష్టం రాసుకుని పోయి 2 నెలలాయే..ఇప్పటిదాకా రూపాయి ఇయ్యలే..ఊదరగొట్టే ఉపన్యాసాలు తప్పరైతుకు రూపాయి రాలే..రైతు రుణమాఫీ జాడనేలేదు..బ్యాంకులోనూ మాఫీ ఐతయని లక్షతీసుకుంటే మిత్తి కలిపి 2 లక్షలు ఐనై..ప్రభుత్వం చెప్పే మాయమాటలునమ్మి మోసపోయేవాడు రైతు ఒక్కడే..జై జవాన్.. జై కిసాన్.. అరుణ్ రెడ్డి పన్నాల

ఆజ్ కి బాత్..

విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, బీర్, స్కాచ్ రెండు అక్షరాలు..తాగడానికి వాడే గ్లాసు, నీళ్లు, సోడా రెండు అక్షరాలు..బార్, పెగ్, మత్తు, వాంతి, తూలిపడే రోడ్డు, కన్నీళ్లు పెట్టే భార్య,రోగం, ఆసుపత్రిలో పెట్టె ఖర్చు, చేసే అప్పు, అమ్మే ఆస్తి..తేడా వస్తే వచ్చే చావు, మోసే పాడే, పూడ్చే గుంత,కాల్చే అగ్ని రెండు...

ఆజ్ కి బాత్..

నిత్యవసరాలు, కూరగాయల ధరలునింగినంటుతున్నాయి..ప్రజల ఆదాయం నేలను చూస్తున్నాయి..ఏం కొనేతట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..మండుతున్న ధరల్లో మారుతున్నాయిసామాన్యుల బ్రతుకులు..పాలక, ప్రతి పక్షాలు బురద రాజకీయాలుమానండి.. సేవ చేద్దాం అని వచ్చిపన్నుల పోటుతో చావగొట్టబడితిరి..ఆకలినైనా భరించగలం.. కానీఅవమానాన్ని భరించలేం..ఆత్మాభిమానం దెబ్బతింటేపగబడతరు.. పడగొడుతరు సుమా.. !- మేదాజీ

ఆజ్ కి బాత్..

మేలుకో బహుజనా.. రాజ్యాధికారం సాధించుకో..ఏ పార్టీ మ్యానిఫెస్టో చూసినా ఏముంది గర్వకారణం..ఏ పార్టీ సభ పెట్టినా ఫలితం లేని నేతల ప్రసంగాలు..యువత భవిష్యత్తు నేతలకు కానరావడం లేదా..?రైతు కంట కన్నీరు తుడిచేవారే లేరా..?ఉచితాల పేరుతో ఓటర్లను మభ్యపెట్టడమేనా..?ఓటు వేయించుకోవడమే నాయకులకు తెలుసా..?యువత భవిష్యత్తు కోసమై, రైతు సంక్షేమానికైచేసే ప్రసంగాలే లేవా..?ఓ యువత, ఓ రైతన్నా...

ఆజ్ కి బాత్

అరణ్యంలా మారిన ఈ సమ సమాజంలో..అదుపులేని వికృత భావాలనువంటబట్టించుకున్న మనిషి..సాటి మనుషుల అల్ప ప్రాణాలనుదుర్మార్గంగా వేటాడుతూనే ఉన్నాడు..సమాజం కలుషితమైన నేపథ్యంలోజాగృతం చేయాల్సిన మేధావులు,సమాజ సేవకులుగా పిలువబడుతున్న వారు..తుచ్చ రాజకీయ అడుగులకు మడుగులుఒత్తుతుండటంతో.. అడ్రస్ గల్లంతైనమంచి, మానవత్వాలు.. ఎవరూ చూడకుండాతమ కన్నీళ్లను తుడుచుకుంటూ..కళ్ళముందు జరుగుతున్న అరాచకాలనుఅరికట్టలేని దౌర్భాగ్యస్థితిలోకొట్టుమిట్టాడుతున్నాయి..రాజకీయాల్లో సమూల మార్పులు జరగాలంటే..మంచికి పట్టం దక్కాలంటే.. యువత...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -