Sunday, May 19, 2024

aaj ki baath

ఆజ్ కి బాత్..

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నఇంకా రాజ్యాధికారం అగ్రవర్ణాల వారి చేతుల్లోనేతిరుగుతున్నది. 55 శాతం మెజార్టీ ప్రజలైనబిసిలు బిచ్చగాళ్లు కాదు.ఓట్లు వేసే యంత్రాలు కాదు..పల్లకీలు మోసే బోయిలు కాదు..జిందాబాద్ లు కొట్టే కార్యకర్తలు కాదు..రాజకీయ బానిసలు కాదు..రాజ్యాధికారంలో భాగస్వాములు బిసిలు..ఓ బీసీ మేలుకో నీ రాజ్యాన్ని నువ్వే ఎలుకో.. కోట్ల వాసుదేవ్..

ఆజ్ కి బాత్..

జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికిఏమున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే..నేను నమ్మిన వాళ్ళు నన్నునిట్ట నిలువునా ముంచి మోసం చేసినా..నన్ను నమ్ముకున్న వాళ్ళను నేనెప్పుడూమోసం చేయలేదని గర్వంగా చెప్పుకోగలగాలి..అదే నిజమైన వ్యక్తిత్వం అంటే..కానీ బ్రదరూ.. ఈనాటి మేటిరాజకీయ నాయకులు..వారూ వీరూ అని లేకుండా అందరినీమోసం చేస్తున్నారు.. వీరేమని గర్వంగాచెప్పుకుంటారు..? అసలు వీరికి ఆత్మగౌరవంఅనేది ఉంటే కదా చెప్పుకోవడానికి..సిగ్గూ ఎగ్గూ...

ఆజ్ కి బాత్..

ఈ ఆకస్మిక మరణాలకు మూలం ఏంటి..?కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి..?ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వాలుపట్టించుకోవడంలేదు..అసలీ ఈ ఆకస్మిక మరణాలకుమూలాన్ని కనుక్కోండి..మరిన్ని మరణాలు జరగకుండారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలుతీసుకోవాలి మహాప్రభో.. వత్తుల భాస్కర్..

ఆజ్ కి బాత్..

ఐదేళ్లు గడిస్తేగాని జనాలుగుర్తురాని ఆధునిక గజినీలు..ఆచరణకు వీలుకాని హామీలనోములు నోచే హేమాహేమీలు..చెవుల్లో పూలమొక్కల విత్తులనుమొలిపించే ప్రభుద్దులు..పెదాలమీదే పిండివంటలు వండేనవయుగ నలభీములు..రేవు దాటేసాక తెప్ప తగలేసేమహామహులు.. ఎన్నాళ్ళో కృత్రిమ శ్వాసతోమూలిగిన నల్లధనం..ఇన్నాళ్ళకి స్వేచ్చావాయువు పీల్చుకునేచక్కని తరుణం.. అల్లి ప్రవీణ్

ఆజ్ కి బాత్

ఓ మనిషి ఎందుకు నీకు ఇంత ఆశ..పశు పక్షాదులను చూసి నేర్చుకోలేవా..పక్షులు గుడ్లు పెట్టి మూడు నెలల వరకేతమ పిల్లల్ని తమ వెంట ఉంచుకుంటాయి.ఓ మనిషి మరి నీవు మాత్రం నీ పిల్లలు,వారి పిల్లలకు సరిపడా ఆస్తులు కూడ పెడతావ్..ఇదేనా.. నువ్వు ప్రకృతి నుండి నేర్చుకున్నది..ప్రకృతి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నది…కానీ నువ్వు ప్రకృతిని...

ఆజ్ కి బాత్

రాజకీయాన్నే వ్యాపారంగా మార్చుకున్ననాయకులు.. విష రాజకీయ చదరంగాన్నిసాగించినంత కాలం..జనస్వామ్యంపై ధనస్వామ్యంగెలిచినంత కాలం..ప్రజాస్వామ్యం పవిత్రమైన పతితగా ప్రతీదినంపతనమౌతుంది.అమలు కాని ఆశయంలా అంగలారుస్తుంది.మిగిలి పోయిన నిరాశలాతిరిగి రాని స్వప్నంలా మారుతుంది. అల్లి ప్రవీణ్..

ఆజ్ కి బాత్

ఈ రోజుల్లో.. జర్నలిస్టులే జనం గోడు మరిచిపార్టీ కార్యకర్తలై జేజేల నినాదాలు రాసుకొస్తున్నారు.ఎదురు తిరగాల్సిన ఎడిటర్లే ఎదురెల్లిపోయిసాష్టాంగ నమస్కారం చేసి పొద్దుకో పార్టీకిపట్టాభిషేకం చేస్తున్నారు.చైతన్యం చేయాల్సిన పత్రికలే జనం బుర్రలలోకినిస్సారమైన భావాలను జొప్పించిఉద్యమహీనులని చేస్తున్నాయి.వాస్తవాలను రాయలేని పత్రికలు సమాజాన్నితప్పుదోవన నడిపిస్తున్నాయి.తెర వెనుక సంఘటనలపై మన్నుగప్పి ఉత్తుత్తిభావాలను ప్రచారం చేసే పాడు పత్రికల కాలంఇప్పుడు నడుస్తోంది.గద్దే...

ఆజ్ కి బాత్..

నా తెలంగాణ కోటి రతనాల వీణనే..కాని ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది..నా తెలంగాణ స్వఛ్చమైనదే కాని ఇప్పుడుకచరా పాలనలో కల్తీ అయింది..నా తెలంగాణ ప్రజలు ప్రస్తుతంబానిసత్వంలో ఉన్నరు…కానీ, కలియుగ కల్తీ పాలన అంతం అయ్యే రోజులుబహు దగ్గరలోనే ఉన్నవి.పైస మదంతో పదవి అహంకారంతోప్రజల రక్తాన్ని రాక్షసునిలాగా త్రాగుతున్నరాజకీయ ముష్కరులారా మారండి.. నరేష్ యాదవ్..

ఆజ్ కి బాత్

నేడే పాఠశాలలు ప్రారంభం..సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలుస్వాగతం పలకబట్టే ..ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలోతీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెప్పిరి మన పాలకులువందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి ఖర్చుచేస్తామని మాటలు చెప్పారు..మన ఊరు - మనబడి కార్యక్రమాన్నిమూటలు కట్టి మూలకు పడేసి..దశాబ్ది ఉత్సవాల పేరుతోపార్టీ ప్రచారాలు చేసుకున్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ ప్రజలు త్వరలోనేసరైన సమాధానం చెబుతారు నాగిరెడ్డి...

ఆజ్ కి బాత్

ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజల జీతగాడు.సీఎం అంటే రాష్ట్ర ప్రజలకు పెద్ద జీతగాడు.ఓటు అంటే తెల్ల కాగితం కాదు!కంప్యూటర్ బటన్ కాదు!!వెయ్యి రూపాయల నోటు కాదు..బీరు, విస్కీ బాటిల్ అసలే కాదు…మనం ఓటు వేస్తే ఎమ్మెల్యేలు అవుతున్నారు..ఎమ్మెల్యేలను కూడగడితే ముఖ్యమంత్రులుఅవుతున్నారు. మనం ఓటు వేస్తే ఎంపీలు అవుతున్నారు..ఎంపీలను కూడ కడితే ప్రధాన మంత్రులుఅవుతున్నారు…ప్రజాస్వామ్య పాలన...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -