Thursday, April 18, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అరణ్యంలా మారిన ఈ సమ సమాజంలో..
అదుపులేని వికృత భావాలను
వంటబట్టించుకున్న మనిషి..
సాటి మనుషుల అల్ప ప్రాణాలను
దుర్మార్గంగా వేటాడుతూనే ఉన్నాడు..
సమాజం కలుషితమైన నేపథ్యంలో
జాగృతం చేయాల్సిన మేధావులు,
సమాజ సేవకులుగా పిలువబడుతున్న వారు..
తుచ్చ రాజకీయ అడుగులకు మడుగులు
ఒత్తుతుండటంతో.. అడ్రస్ గల్లంతైన
మంచి, మానవత్వాలు.. ఎవరూ చూడకుండా
తమ కన్నీళ్లను తుడుచుకుంటూ..
కళ్ళముందు జరుగుతున్న అరాచకాలను
అరికట్టలేని దౌర్భాగ్యస్థితిలో
కొట్టుమిట్టాడుతున్నాయి..
రాజకీయాల్లో సమూల మార్పులు జరగాలంటే..
మంచికి పట్టం దక్కాలంటే.. యువత నడుం
బిగించక తప్పదు.. ఓ యువతా మేలుకో..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు