Tuesday, May 7, 2024

ప్రపంచ కప్‌ 2024షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ

తప్పక చదవండి

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రపంచ కప్‌ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్‌ లు జరగనున్నాయి. ఇంతకు ముందు.. ఈ టోర్నమెంట్‌ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్‌ లో.. భారత్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, వెస్టిండీస్‌, నమీబియా, ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, నమీబియా, నేపాల్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియాతో కలిపి 16 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని మాంగాంగ్‌ ఓవల్‌లో జరిగే ఛాంపియన్‌షిప్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఐర్లాండ్‌-యుఎస్‌ఎ జట్టు తలపడనున్నాయి. పోచెఫ్‌స్ట్రూమ్‌లోని జెబి మార్క్స్‌ ఓవల్‌, ఈస్ట్‌ లండన్‌లోని బఫెలో పార్క్‌, కింబర్లీలోని కింబర్లీ ఓవల్‌, బెనోనిలోని విల్లోమూర్‌ పార్క్‌ ఈ టోర్నమెంట్‌ కు వేదికలు కానున్నాయి. ఇదిలా ఉంటే.. డిఫెండిరగ్‌ ఛాంపియన్స్‌ భారత్‌ తన తొలి మ్యాచ్‌ జనవరి 20న బంగ్లాదేశ్‌ తో ఆడనుంది. ఆ తర్వాత.. జనవరి 25, 28 తేదీల్లో జరిగే తొలి రౌండ్‌లో ఐర్లాండ్‌తోనూ, అమెరికాతోనూ భారత్‌ తలపడనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు