Thursday, May 16, 2024

ప్రజాతీర్పును గౌరవిస్తా..

తప్పక చదవండి
  • ఎమ్మెల్యే తలసాని

రాంగోపాల్‌ పేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ప్రజాతీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.ఆదివారం ఉస్మానియా యునివర్సిటీలో కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారులు ఫలితాలు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను సనత్‌నగర్‌ నుండి మూడోసారి గెలిచానన్న సంతోషం కంటే ప్రభు త్వంలోకి రాలేకపోతున్నామనే బాధ ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఆయన అభినందనలు తెలిపారు. దేశానికి స్వాతత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో గడిచిన తొమ్మిదిన్నర సంవత్స రాలలో జరిగిందని చెప్పారు. నూతనంగా ఏర్పడేకాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకుఇచ్చిన హామీలను అమలు చేస్తుందని,ప్రజలు ఆశించిన పాలనను అందిస్తారని ఆశిస్తున్నామన్నారు.తనపై పోటీలో నిలిచి ఓటమి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్ధి కోట నీలిమ, బిజెపిఅభ్యర్ధి మర్రి శశిధర్‌ రెడ్డిలకు తలసాని సానుభూతిని తెలిపారు.రాజకీయాలలో గెలుపు, ఓటములుసహజమని, ఓటమిచెందామని అదైర్యపడొద్దని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు