Wednesday, October 16, 2024
spot_img

సూర్యాపేటలో ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు

తప్పక చదవండి
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో
    ఒకే ఒక్క చోట బి.ఆర్‌.ఎస్‌ గెలుపు..
  • సూర్యాపేట జిల్లాలో ఒకే ఒక్కడు జగదీష్‌ రెడ్డి..
  • జిల్లాలో మూడు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ గెలుపు..
  • హుజూర్‌ నగర్‌, కోదాడ ఉత్తం కుటుంబం కైవసం..
  • భారీ మెజార్టీతో తుంగతుర్తిలో మందుల సామెల్‌ గెలుపు..
  • జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు..

సూర్యాపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఈనెల 30న జరిగిన ఎన్నికలకు ఈరోజు (డిసెంబర్‌ 3) జరిగిన లెక్కింపులో వెలువడిన ఫలితాలు గెలిచిన అభ్యర్థులకు ఆనందం.. ఓడిన అభ్యర్థులకు నిరాశ మిగిల్చింది. ఓట్ల లెక్కింపు లో ప్రతి రౌండ్‌ కి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులకు తీవ్ర ఉత్కంఠ నడుమ కొనసాగింది.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించిన శాసనసభ ఎన్నికల ఫలితాలు జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారి ఎస్‌ వెంకట్రావు సమక్షంలో సజావుగా జరిగింది.
సూర్యాపేటలో మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టిన జగదీష్‌ రెడ్డి..
సూర్యాపేట నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి 4605 ఓట్లతో గెలుపొందారు. ప్రతి రౌండ్‌ లో అభ్యర్థులను ఉత్కంఠ భరితంగా సాగింది. సూర్యాపేట నియోజకవర్గం లో మొత్తం 2,03,564 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి కి 74,433, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్‌ రెడ్డి దామోదర్‌ రెడ్డికి 68,685.భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు కి 40,072, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి 13,734 ఓట్లు నమోదు అయ్యాయి.ఈ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు వేసిన కోస్టల్‌ బ్యాలెట్లలో 3120 మంది తమ పోస్టల్‌ బ్యాలెట్‌ లను ఉపయోగించుకున్నారు. వాటిలో టిఆర్‌ఎస్‌ పార్టీకి 703, కాంగ్రెస్‌ 1843, బీజేపీ 326, బిఎస్పీ 141 ఓట్లు పోలయ్యాయి. సూర్యాపేట నియోజకవర్గంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోస్టర్‌ బ్యాలెట్‌ల నుండి చివరి రౌండ్‌ ముగిసే వరకు కూడా బిఆర్‌ఎస్‌ పార్టీ ముందంజలో ఉంటూ చివరకు అని ఓట్లు కలుపుకొని 4605 ఓట్లతో గెలుపొందింది.
తుంగతుర్తిలో మందుల సామేలు గెలుపు పోల్లు పొల్లు..
తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు దాఫాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి గెలిచిన టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గాదర్‌ కిషోర్‌ కుమార్‌ పై, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 50,253 ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.తుంగతుర్తి నుండి మూడవ సారి బరిలో దిగిన గాదరి కిషోర్‌ కుమార్‌ కు 78,058 ఓట్లు పోలవగా, మందుల సామెలుకు 1,28,311 అత్యధిక ఓట్లు వచ్చాయి.కాంగ్రెస్‌ పార్టీకి అనూహ్యంగా రౌండ్‌ రౌండ్‌ కు ఓట్లు పెరుగుతూ వచ్చాయి. కిషోర్‌ కు మొదటి రౌండ్‌ లో 4000 పైనే ఓట్ల ప్రారంభమై, రౌండ్స్‌ పెరుగుతున్న కొద్దీ మూడు వేలకు తగ్గుతూ వచ్చింది.దిందో కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన మందుల సామేల్‌ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
58 వేల ఓట్ల మెజార్టీతో పద్మావతి రెడ్డి ఘన విజయం..
కోదాడలో ఉత్తం పద్మావతి 58,679 ఓట్ల మెజార్టీతో సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ పై ఘన విజయం సాధించారు.కాంగ్రెస్‌ పార్టీ కి 1,25,783 ఓట్లు పొలు అవ్వగా,బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బొల్లం మల్లయ్య యాదవ్‌ కి 67,104 ఓట్లు పోలయ్యాయి. ప్రతి రౌండ్‌ లో ప్రత్యర్థి బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ పైచేయి సాధించారు. ప్రతి మండలంలో 8వేలకు పైగా ఓట్లు సాధించారు.టౌన్‌ లో 20వేలకు పైగా ఓట్లు సాధించారు.దీంతో నియోజక వర్గంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.కాంగ్రెస్‌ నాయకులు పద్మావతి రెడ్డి కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రంలో పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా వుందని, ఇకపై రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తామని కోదాడ ఎమ్మెల్యే గా విజయం సాధించిన ఉత్తం పద్మావతి తెలిపారు.
హుజూర్‌నగర్‌లో ఉత్తం జెట్‌ స్పీడ్‌..
హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుండి కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో జెడ్‌ స్పీడ్‌ లో దూసుకుపోయింది. టిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కి 71,819 ఓట్లు రాగా, పోస్టల్‌ బ్యాలెట్‌ లో 466 ఓట్లు వచ్చాయి. సిపిఐఎం అభ్యర్థి మల్లు లక్ష్మికి కేవలం 1914 ఓటు రాగా పోస్టల్‌ బ్యాలెట్‌ లో కేవలం 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఉత్తంకుమార్‌ రెడ్డికి 1,16,707 ఓట్లు రాగా, పోస్టల్‌ బ్యాలెట్లో 1366 ఓట్లు పాలయ్యాయి. దాదాపు నియోజకవర్గం మొత్తం అందరి దృష్టి తన వైపు తిప్పుకున్న స్వతంత్ర అభ్యర్థి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన పిల్లుట్ల రఘు 8280 ఓట్లతో కొద్దో గొప్ప తన ఉనికిని చాటుకున్నాడు. సైది రెడ్డి కి సెకండ్‌ క్యాడర్‌ నాయకులు లేక, వ్యక్తిగత సమన్వయ లోపం అవినీతి ఆరోపణలు పోల్‌ మేనేజ్మెంట్‌ లో విఫలంకి కారణం అయినట్లు తెలుస్తుంది యువ నాయకులను దూరంగా ఉంచుకొని పాతకాలపు ఏజెండాలను అమలు చేయడం వంటి కారణాలతో బిఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత ఘోర ఓటమిని చవిచూసింది. ఉప ఎన్నికల్లో ఏదైతే మెజార్టీ సాధించిన బిఆర్‌ఎస్‌ పార్టీ, దాదాపు అదే మెజారిటీ నేడు కాంగ్రెస్‌ పార్టీకి రావడం సంచలనంగా మారింది. తుంగతుర్తి కోదాడ సూర్యాపేట హుజూర్నగర్‌ నియోజకవర్గాలలో గెలుపొందిన నాయకులకు ఆనంద వ్యక్తం చేస్తుండగా ఓటమిత్సవ చూసిన అభ్యర్థులు నిరాశతో పోలింగ్‌ కేంద్రాల నుండి వెళ్లిపోయారు. ఏది ఏమైనా గెలుపు ఓటమి లు సహజమే అంటూ పలువురు చెప్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు