Saturday, May 18, 2024

రంగారెడ్డిలోని న్యాయస్థానంలో మైనర్‌పై లైంగిక దాడి కేసు పై తీర్పు..

తప్పక చదవండి
  • 20 ఏండ్ల శిక్ష విడిచిన న్యాయస్థానం
  • బాధితురాలికి పది లక్షల పరిహారం

రంగారెడ్డి : ప్రేమ పేరుతో వెంటపడి.. బలవంతంగా బాలికపై అఘాయిత్యం పాల్పడిన నిందితుడు రమావత్‌ చందర్‌(26)కు 20 జైలుశిక్ష, 30వేల జరిమానా విధిస్తూ, బాధిత బాలిక కుటుంబానికి పది లక్షల పరిహారం అందజేయాలని న్యాయసేవా సంస్థను ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. యాచరం మండలం నల్లవెల్లి తండాకు చెందిన నిందితుడు చందర్‌.. అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వెంటపడగా బాలిక అంగీకరించింది. పాఠశాలకు సెలవులు ఉండటంతో బాలిక కొన్నాళ్ల పాటు వారి బంధువులు ఇంటికి వెళ్లి.. తిరిగి తన సొంత గ్రామానికి వచ్చింది. అయితే, 2017, జూలై 10వ తేదీన తన సమీప బంధువు ఇంటి నుంచి రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్తుండగా.. నిందితుడు రమావత్‌ చందర్‌ బాలికను తనతో రావాల్సిందిగా కోరడంతో ఆమె నిరాకరించింది. బలవంతంగా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. వారు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు రమావత్‌ చందర్‌ను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు