Sunday, June 23, 2024

సెమీ ఫైనల్స్ లో రజనీకాంత్ , బాలీవుడ్ స్టార్లు

తప్పక చదవండి
  • తరలి వచ్చిన సెలబ్రిటీలు!
  • సెలబ్రిటీలతో నిండిపోయిన వీవీఐపీ లాంజ్

ముంబైకి చేరుకున్న రజనీకాంత్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ కాసేపటి క్రితం ప్రారంభమయింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఈనాటి గెస్టుల జాబితాలో వీవీఐపీ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ దిగ్గజం డేవిడ్ బెక్ హామ్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ తదితరులు కనిపించనున్నారు. మ్యాచ్ ను చూసేందుకు రజనీకాంత్ నిన్నే చెన్నై నుంచి ముంబై చేరుకున్నారు. ముంబైకి బయల్డేరే ముందు చెన్నైలో రజనీకాంత్ మాట్లాడుతూ, మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్తున్నానని చెప్పారు. మరోవైపు బెక్ హామ్ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు. మహిళలు, బాలకల సాధికారత, లింగ సమానత్వం కోసం యూనిసెఫ్, ఐసీసీ కలిసి పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు బెక్ హామ్ గెస్టుగా వచ్చారు. సచిన్ టెండూల్కర్ తో కలిసి స్టేడియంలో బెక్ హామ్ సందడి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు