Sunday, May 19, 2024

ముస్లింలపై ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తానన్న ట్రంప్‌

తప్పక చదవండి

వాషింగ్టన్‌ : తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. రిపబ్లికన్‌ యూదు కూటమి వార్షిక సమావేశంలో శనివారం ఆయన ప్రసంగిస్తూ.. ‘ప్రయాణ నిషేధం విూకు గుర్తుందా? నేను రెండోసారి అధ్యక్షుడినైన తొలి రోజే ఆ నిషేధాన్ని తిరిగి పునరుద్ధరిస్తా. మన దేశంలో బాంబు పేలుళ్లను ఇష్టపడే వ్యక్తులు మన దేశంలోకి ప్రవేశించాలని మ నం కోరుకోవద్దు. అందుకే ఈ నిషేధం. గతంలో మా ప్రభుత్వ యంత్రాంగం తీసుకొచ్చిన ఈ చర్య అద్భుత విజయం సాధించింది. నా హయాంలో ఒక్క దుర్ఘటన జరగకపోవడానికి చెడు వ్యక్తులను దేశంలోకి అనుమతించకపోవడమే కారణం‘ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌, లిబియా, సోమాలి యా, సిరియా, యెమెన్‌, ఇరాక్‌, సూడాన్‌ వంటి దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో అడుగు పెట్టకుండా ట్రంప్‌ తన హయాంలో ఆంక్షలు విధించారు. ట్రంప్‌ ప్రకటనను శ్వేతసౌధం తప్పుప ట్టింది. ఇస్లోమోఫోబియాకు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్‌ చర్యలు తీసుకున్నారని, ఇదే విధానాన్ని కొనసాగిస్తారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ వెల్లడిరచారు. కాగా, వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తే ఆ నాలుగేళ్లు ‘గందరగోళం, కక్ష సాధింపులు, నాటకాలతో సాగుతుంది. ఆ పరిస్థితి అమెరికాకు ప్రమాదకరం’ అని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ లాస్‌ వెగాస్‌లో జరిగిన యూదు రిపబ్లికన్ల సమావేశంలో పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు