Saturday, July 27, 2024

కాంగ్రెస్‌లో ముదురుతున్న టిక్కెట్ల రచ్చ

తప్పక చదవండి
  • రోజూ గాంధీభవన్‌ దగ్గర నిరసన, రాస్తారోకోలు
  • నియోజకవర్గాల్లో పార్టీ పెద్దలకు అసంతృప్తుల ఆందోళనలు
  • బిఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్న కాంగ్రెస్‌ నాయకులు
  • బిఆర్‌ఎస్‌కు కలిసివస్తున్న ప్రస్తుత పరిణామాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచిన కాంగ్రెస్‌కు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.ఈసారి తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం శాయశక్తులా కృషి చేస్తుంది. టి పిసిసి రేవంత్‌రెడ్డి కూడా ప్రతి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడంలో కొంత వెనుకబడిరది. బిఆర్‌ఎస్‌ మాత్రం ఒకే సుమారు 100కు పైగా అభ్యర్థులను ప్రకటించి కొన్ని చోట్ల తప్ప ఏకాభిప్రాయంతో ఉన్నది. కానీ కాంగ్రెస్‌ మాత్రం మొన్నటి కాంగ్రెస్‌ రెండో విడద అభ్యర్థుల జాబితా వెలువడిన నాటి నుంచి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు ఆ పార్టీ నాయకులే గుప్పిస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ కోసం పనిచేసిన నాయకులను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి, ఇంకా చెప్పాలంటే డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ఈ నిరసనలకు కేరాఫ్‌ గాంధీభవను అడ్డాగా మారింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి ఇది పెద్దతలనొప్పిగా మారింది. ఇది వరకే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నేతలంతా కలిసిపనిచేయాలని పిలుపునిచ్చినా కొంతమంది నాయకులు మాత్రం వారి స్వలాభం కోసం పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈపరిణామం బిఆర్‌ఎస్‌ కొంత కలిపివస్తోంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్‌ఎస్‌కు ప్రజలు రెండుసార్లు అధికారం ఇచ్చారు. ఈసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒకసారి అవకాశం ఇద్దామనుకుందామని కొందరు ప్రజలు భావించిన కాంగ్రెస్‌ తమ స్వయం తప్పిదాల వల్ల అది సాధ్యం అయ్యేటట్లు కనిపించడం లేదు. రెండుసార్లు స్థానిక బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలతో విసిగిపోయిన స్థానిక ప్రజలకు ఈసారి కాంగ్రెస్‌ నుంచి సరైన అభ్యర్థి, హామీలు ఉంటే వారికే అవకాశం ఇవ్వాలని భావించినా అందుకు కాంగ్రెస్సు నుంచి పెద్దగా ప్రయత్నాల కనిపించడం లేదు. దీంతో మరోసారి బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావటానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్నిచోట్ల బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎల పనితీరు, వారి అనుచరుల ఆగడాలపై ప్రజలు మాత్రం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో ఆయా చోట్ల మాత్రం బిఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఫలితాలు వస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈసారి కాంగ్రెస్‌కు మాత్రం గతకంటే ఈసారి సీట్లు పెరగవచ్చునే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎక్కువ స్థానాలు కావాలంటే కాంగ్రెస్‌ నాయకులు ఏకతాటిపైకి వచ్చి ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కల్పించాలి. ఇప్పుడు అమలు అవుతున్న పథకాల స్థానంలో ఆరు గ్యారంటీలతోపాటు మరికొన్ని పథకాలను తీసుకవస్తే కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు ఉంటాయి. లేకపోతే బిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే స్థానిక ఎంఎల్‌ఎలపై ఎంత వ్యతిరేకత ఉన్నా బిఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చివరికు ఆ పార్టీని అధికారంలోకి తీసుకవస్తాయి. మొత్తం మీద కాంగ్రెస్‌వైపు గాలి వీస్తున్న ఆపార్టీ విధానాలు, స్వార్థ ప్రయోజనాలను, నాయకుల పనితీరు, విమర్శలు, ఏకాభిప్రాయాలు ఇలా చాలా అడ్డండకులు మూలన ఆ పార్టీకి ఈసారి కూడా ఎదురీత తప్పదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు