Wednesday, April 24, 2024

వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

తప్పక చదవండి
  • వర్ష కాలంలో గతనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల్లో ముంపు లేకుండా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలి..
  • విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ సమస్య లేకుండా సమన్వయం చేసుకోవాలి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి కాలం, వర్ష కాలంను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగర ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టడానికి హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లోని మంత్రి కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.. సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ తో పాటు హైదరాబాద్ జిల్లా కి సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వేసవి కాలంలో నగర ప్రజలకు తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చెప్పట్టాలని అధికారులను ఆదేశించారు.. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బ్యారేజీలలో ఉన్న నీటి లెవెల్స్ పై ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలని సూచించారు.. 2017 తరువాత ఈ సంవత్సరంలోనే కొంత వర్ష భావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ నగరానికి తాగు నీటికి ఎక్కడ ఇబ్బందులు లేవని అధికారులు మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చారు.. వేసవి కాలంతో పాటు రానున్న రంజాన్ నెల ను దృష్టిలో పెట్టుకొని వాటర్ టాంకర్లు 24 గంటలు తిరగడానికి అధికారులు అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించారు.. మోటార్లు 24 గంటలు నడిచేలా పవర్ కట్ లేకుండా చూసుకోవాలని , మోటార్లు సంబంధించి ఉన్న ఏమైనా ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.. ఎల్లంపల్లి నుండి హైదరాబాద్ కి 10 టిఎంసీ ల నీటిని ఉపయోగించుకోవాలని హైదరాబాద్ తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు.. ఎల్లంపల్లి నీళ్ళు సిద్దిపేట , గజ్వేల్ , దుబ్బాక లకి ఇవ్వకుండా మొత్తం హైదరాబాద్ కి తీసుకెళ్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇందులో వాస్తవం లేదన్నారు..

గతనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వర్ష కాలంలో ముంపు ప్రాంతాలు ఉండకుండా ఆస్తి , ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆదేశించారు.. గతంలో వర్షాలకు మునిగిపోయిన కాలనీలో గుర్తించి అక్కడ తీసుకోవాల్సిన వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. నాళాల్లో సీల్ట్ తొలగించాలని సీల్డ్ ఉండడం వల్ల వరద నీరు పైకి వచ్చి కాలనీలు మునిగిపోయే అవకాశం ఉందన్నారు.. గతంలో రాజ్ భవన్ వద్ద భారీ వర్షానికి నీళ్ళు ఆగుతుండేవని అక్కడ నీళ్ళు ఆగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారని అడిగారు .. కొత్తగా సెక్రటేరియట్ నిర్మాణం జరిగిన తరువాత దాని ముందు వాటర్ భారీగా నిల్వ ఉంటున్నాయని అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.. దానిపై ఆర్అండ్ బి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారాని చొరవ తీసుకుంటానని మంత్రి గారు హామీ ఇచ్చారు.. భారీ వర్షాల సమయంలో గతంలో మ్యాన్ హోల్స్ లో పడి ప్రమాద ఘటనలు జరిగాయని అలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండకుండా అధికారులు మ్యాన్ హోల్స్ పై మూతలు తెరిచిన తరువాత వాటర్ వెళ్ళే వరకూ సిబ్బంది అక్కడే ఉండి పర్యవేక్షించాలని సూచించారు.. ప్రధానంగా వరద వస్తున్న ప్రాంతాల్లో నాళాల పై ఉన్న ఇళ్ళ నిర్మాణం వల్లేనని అక్కడ నుండి వారిని తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లో ఉండే అంశాలని పరిశీలించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి కి సూచించారు.. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య లేకుండా జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.. ఫ్రీ లెఫ్ట్స్, జంక్షన్ లలో ట్రాఫిక్ లేకుండా చూడడంతో పాటు రోడ్ల పై జరుగుతున్న పార్కింగ్ తదితర అంశాలపై మంత్రి గారి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు.. బస్ స్టాప్ ల వద్ద కూడా ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ,ఆర్టీసి , ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోవాలని సూచించారు.. హైదరాబాద్ లోని స్కూళ్ల లో , హాస్టల్ లలో వాటర్ ప్రోబ్లం రాకుండా అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యేలోపు అధికారులు చెక్ చేసుకోవాలని సూచించారు.. ఎక్కడైనా అవసరమైన చోట తను ఇంఛార్జి మంత్రి గా ఉన్న ఫండ్స్ నుండి నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నానని వాటిని గుర్తించాలని తెలిపారు.. ఎన్నికల కోడ్ రాక ముందే ఏదైనా పనులు ప్రారంభించేవి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనీ మంత్రి గారు ఆదేశించారు ..

- Advertisement -

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు.. ఇప్పటికే నాళాల్లో సీల్డ్ తీయడం ప్రారంభించామని వరదల సమయంలో మన్స్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయని తెలిపారు.. 245 స్టాటిక్ టీమ్స్ తో పాటు 30 డిఆర్ఎఫ్ బృందాలు ,147 మొబైల్ టీమ్స్ ఉన్నాయని తెలిపారు.. ఎస్ఎన్‌డిపి ద్వారా హైదరాబాద్ లోని చాలా కాలనీల్లో ముంపు రాకుండా పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.. హైదరాబాద్ లో గృహ జ్యోతి పథకం అమలు అవుతున్న డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పవర్ కి ఇబ్బందులు ఉండవని విద్యుత్ అధికారులు తెలిపారు.. లా అండ్ ఆర్డర్ విషయంలో అదే విధంగా ట్రాఫిక్ సమస్య పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించిస్తున్నమని హైదరాబాద్ , రాచకొండ పోలీస్ అధికారులు తెలిపారు.. సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రాస్ , జాయింట్ మెట్రో పాలిటన్ కమిషనర్ అమ్రాపాలి, హెచ్ఎండ‌బ్ల్యూఎస్ఎస్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి , హైదరాబాద్ , సైబరాబాద్ కమిషనరేట్ లోని పోలీస్ అధికారులు , ఇతర డిపార్ట్మెంట్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు