Tuesday, May 14, 2024

నన్ను నిర్బంధిస్తే నిజాలు దాగవు..

తప్పక చదవండి
  • తన హౌస్ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్..
  • మేడిగడ్డ ప్రాజెక్ట్ కృంగిపోయిన బ్యారేజ్ ను పరిశీలనకు వస్తున్న రాహుల్ గాంధీ
  • వెంట వెళ్లకుండా నిర్బంధించడం అమానుషం..
  • రేపు నిజానిజాలు వెలుగులోకి వస్తే అక్రమార్కుల నడ్డి విరగడం ఖాయం..

హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లా కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లకు పైగా బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం దోచుకునే క్రమంలో, నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లోపాలతో నిర్మాణం చేసిన మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడం జరిగిందని.. నిన్న అనగా శుక్రవారం రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కాలేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాలను పరిశీలనకు వస్తున్నారని వారికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బయలుదేరుతున్న క్రమంలో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ చైర్మన్ బక్క జడ్సన్ రాహుల్ గాంధీతో వెళ్లకుండా కట్టడి చేస్తూ తనను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్యాక్రాంతం కాకుండా సొంత పరిపాలన కోసం, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తట్టుకోలేక కన్నతల్లి లాగా చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. అదే అదనుగా భావించి, రాష్ట్రాన్ని బీ.ఆర్.ఎస్. అధినేత సీఎం కేసీఆర్ దోచుకుంటూ నీళ్లు, నిధులు, నియామకాలను మాయం చేస్తూ.. తెలంగాణ ప్రజలకు అప్పుల భారం మోపారని, నాణ్యత లోపాలతో కాలేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం జరిగిందని అనడానికి నిదర్శనమే.. మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ కృంగిపోవడం అని బక్క జడ్సన్ ఆరోపించారు.

- Advertisement -

కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు రీ డిజైన్ పేరుతో దోచుకున్నారని, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సిబిఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లకు ఫిర్యాదు గతంలోనే చేసి ఉన్నానని ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు నేటి వరకు జరగలేదని బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు లోపాయి కారి ఒప్పందమే అందుకు కారణమని ఆరోపించారు. భారతదేశంలో ప్రజల ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు, పేద, బడుగు బలహీన, దళిత వర్గాల కు రక్షణ కరువైందని, మతోన్మాద శక్తుల కుట్రలతో దేశాన్ని దోచుకుంటూ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా నియంత పాలన దేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్నదని కాంగ్రెస్ అధినేత దేశ ప్రజలను ఏకం చేయుటకు భారత్ జోడోయాత్రతో దేశ ప్రజల ప్రేమను పొందుతుంటే.. ఈ ప్రభుత్వాలు ఓర్వలేక నేడు కాలేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ ను పరిశీలించుటకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనకుండా హౌస్ అరెస్టులు చేయడం సమంజసం కాదని.. లక్షల కోట్ల కుంభకోణం కాలేశ్వరం అని.. వెంటనే కాలేశ్వరం ప్రాజెక్టులోని నాణ్యత లోపాలపై, అవకతవకలపై అక్రమార్జనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరినీ వదిలేది లేదని, దోషులను కఠినంగా, చట్టపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం శిక్షిస్తుందని బక్క జడ్సన్ అన్నారు. ఈబిసి చైర్మన్ వాళ్లభారెడ్డి, రవీందర్ రెడ్డి, పీసీసీ నాయకులు లక్ష్మణ్ యాదవ్, ఐవైసి ప్రధాన కార్యదర్శి హరీష్ వర్ధన్ ఆయనకు సంఘీభావం ప్రకటించడం విశేషం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు