Sunday, April 28, 2024

ముఖ్యమంత్రి మావాడే.. మేము ఏమి చేసినా చెల్లుతుంది..

తప్పక చదవండి
  • సీఎం పేరుచెప్పుకోని చక్రం తిప్పుతున్న లచ్చిరెడ్డి..
  • రెవెన్యూ డిపార్ట్మెంట్‌ని తన జాగీరుగా భావిస్తున్న వైనం..
  • 4 సంవత్సరాలు ఉద్యోగానికి దూరంగా ఉన్న లచ్చిరెడ్డి..
  • ఇటీవలే విధుల్లో చేరిక.. ఒక ఉద్యోగ సంఘం స్థాపన..
  • రెవెన్యూ బదిలీల్లో చక్రం తిప్పుతూ భూదందాలకు తెర..
  • నవీన్‌ మిట్టల్‌.. ఓ ఎస్‌ డీ రమేష్‌ పాకతో చేతులు కలిపి దందాలు..

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తమ కులం వాడైతే చాలు.. కొంతమంది కన్నింగ్‌ గాళ్ళు ఆయనతో బంధుత్వం ఉందని..చెప్పుకుంటూ తమమాట చెల్లుతుందని బిల్డప్‌ లు ఇస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.. ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు రెవెన్యూ శాఖలో జరుగుతోంది.. లచ్చి రెడ్డి అనే అధికారి.. పిచ్చి పిచ్చిగా తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ లక్షల్లో వెనుకేసుకుంటున్నట్లు వదంతులు వినబడుతున్నాయి.. ఆ వివరాలు ఒకసారి.. చూద్దాం

ఎనుకటికి ఓ పాత సామెత గుర్తొస్తుంది .. చెట్టు పేరుచెప్పుకుని కాయలు అమ్ముకున్నట్లు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మావాడే అని చెప్పుకుంటూ లచ్చి రెడ్డి అనే అధికారి రెవెన్యూ శాఖలో జరుగుతున్న బదిలీలలో తన ఇష్టం వచ్చినట్లు చక్రం తిప్పుతూ.. రెవెన్యూ ఎక్కువుగా ఉన్న చోటికి, వెళ్ళడానికి ఉత్సాహం చూపే అధికారులను వారు కోరిన చోటికి బదిలీలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.. అయితే ఇతగాడు గత 4 ఏళ్లుగా తన విధులకు దూరంగా ఉండి ఇటివలే ఉద్యోగంలో చేరాడని తెలుస్తోంది.. చేరిన మరుక్షణమే ఒక ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసిన లచ్చిరెడ్డి.. ఇక అప్పటినుండి పెద్ద నాయకుడిగా చలామణి అవుతూ.. తనకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయని అందరినీ నమ్మిస్తూ పలు అక్రమాలకు పాల్పడుతున్నాడు..

- Advertisement -

ఇటీవల జరిగిన రెవెన్యూ శాఖ బదిలీలలో లచ్చిరెడ్డి ప్రమేయంపై పుకార్లు షికారు.. ఇటీవల జరిగిన రెవెన్యూ శాఖ బదిలీలలో అవినీతి ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిట్టల్‌తో చేతులు కలిపి.. తనకు సంబంధించిన వారిని అధిక రెవెన్యూ వచ్చే హైదరాబాద్‌ నగర చుట్టూ ఉన్న రెవెన్యూ కార్యాలయాల్లో ఆర్దీఓ లుగా.. తహశీల్దార్లుగా.. పోస్టింగులు ఇప్పించి.. వారినుంచి భారీ ఎత్హునా భూదందాలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఇతగాడు ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించాల్సింది సి సి ఎల్‌ ఏ లో.. కానీ వారం రోజులుగా సచివాలయంలోని నవీన్‌ మిట్టల్‌ చాంబర్‌ లో లో తిష్ట వేసి, నవీన్‌ మిట్టల్‌ పీఏ ‘‘రమేశ్‌ పాక’’ అనే బ్రోకర్‌ ద్వారా.. బదిలీ అయిన వారికి బదిలీ ఉత్తర్వులు చేరకముందే.. వారికి ఫోన్‌ చేసి తానే వారికి హైదరాబాద్‌ కి దగ్గరగా పోస్టింగ్‌ ఇప్పించాను అని చెబుతూ.. భారీగా అక్రమ వసూళ్లు చేసినట్టు రెవెన్యూ శాఖలో గుస గుసలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే అతని కాల్‌ డేటా, సచివాలయం లో నవీన్‌ మిట్టల్‌ సి సి కెమెరాల ఫుటేజీ చూస్తే తెలుస్తుంది.. అదే విధంగా హైదరాబాద్‌ నగర ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ ఉన్న ఆర్‌ డీ ఓ పోస్టులను తన చుట్టూ తిరిగే అవినీతి పరులకు ఇప్పించి భారీగా అక్రమ భూ దందాకు తెరలేపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

పెద్ద భూ దందాకు ధరణి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లచ్చిరెడ్డి పెద్ద ప్లాన్‌..
హైదరాబాద్‌ లోని తిరుమలగిరి మండలంలో ఉన్న రూ. 100 కోట్ల విలువైన డిఫెన్స్‌ భూమికి 2016 లో ఎన్‌ ఓ సి ఇచ్చి సస్పెండ్‌ అయిన రామకృష్ణ అనే తహశీల్దార్‌ కు ఇటీవల డిప్యూటీ కలెక్టర్‌ గా ప్రమోషన్‌ రావడంతో, అతనిని అతనితో పాటు మరి కొంతమంది తన అనుచర గణానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట ఉన్న కీలకమైన డివిజన్లలో ఆర్‌.డీ.ఓ. లుగా పోస్టింగ్‌ లు ఇప్పించి మరో పెద్ద భూ దందాకు ధరణి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లచ్చిరెడ్డి పెద్ద ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది.. ఇక్కడ గమనిం చాల్సిన విషయం ఏమిటంటే.. నవీన్‌ మిట్టల్‌ ఎక్కడ విధులు నిర్వహిస్తే అక్కడ ఓ ఎస్‌ డీ గా పాక రమేష్‌ ఉంటాడు.. ఎందు కంటే అక్రమ దందాలకు అతగాడే మధ్యవర్తి కనుక.. మరిన్ని వివరాలను మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని వస్తాం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు