Tuesday, April 30, 2024

తమిళనాడులో ఈడీ అలజడి..

తప్పక చదవండి
  • ఏకకాలంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి,
    ఆయన కుమారుడి నివాసాలపై దాడులు..
  • లెక్కల్లో చూపించని రూ. 71 లక్షలు,
    రూ. 10 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం..
  • రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు : స్టాలిన్..

మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని రూ.70 లక్షల రూపాయల నగదు, రూ.10 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది. చెన్నైలో పొన్ముడి, ఆయన కుమారుడు ఉంటున్న నివాసంతో పాటు విల్లుపరం జిల్లాలోని వారి స్వగ్రామంలో కూడా ఏకకాలంలో ఈడీ దాడులు జరిపింది.

రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు : సీఎం స్టాలిన్

- Advertisement -

కాగా, డీఎంకే మంత్రి, ఎంపీ నివాసలపై ఈడీ దాడులు రాజకీయ కక్షతో జరిపినవేనని ఆ పార్టీ ఆరోపించింది. బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశానికి అడ్డంకులు కలిగిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా దాడులు జరిగాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. డీఎంకే అధికారంలో ఉన్న బలమైన పార్టీ అని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని అన్నారు. ఇటీవలే పొన్ముడిపై ఉన్న రెండు కేసులు కొట్టేశారని, ఈ కేసును కూడా చట్టబద్ధంగానే ఆయన ఎదుర్కొంటారని చెప్పారు. విల్లుపురం జిల్లాలోని తిరుక్కొయిలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 72 ఏళ్ల పొన్ముడి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన కుమారుడు సిగమణి తమిళనాడులోని కాళ్లకురిచ్చి నియోజవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత రెండు నెలల్లో స్టాలిన్ మంత్రివర్గ సభ్యులపై ఈడీ జరిపిన రెండవ దాడి ఇది. మంత్రి సెంథిల్ బాలాజీపై ఇటీవల ఈడీ దాడులు జరిపి, విచారణ అనంతరం అరెస్టు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు