Wednesday, May 22, 2024

శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి అష్టాభిషేక టికెట్ల పై కేరళ హైకోర్టు నిబంధన

తప్పక చదవండి
  • ప్రతిరోజు కేవలం 15 మంది భక్తులకే అవకాశం
  • ఈ నిబంధన తెలియక ఇక్కట్లు పడ్డ భక్తులు
  • రద్దీ దృష్ట్యా, జనవరి వరకు అమలు.
  • హైకోర్టు ఉత్తర్వులను అమలుపరుస్తున్న తమతో భక్తులు సహకరించాలని విన్నవించిన ఆలయ పి.ఆర్.ఓ. సునీల్

శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామికి జరిపే అష్టాభిషేక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 8 రకాల వైవిధ్య దివ్య ద్రవ్యాలతో స్వామి వారికి జరిగే అష్టాభిషేకం నయనానందకరం, అపూర్వం, అమోఘం. సాధారణంగా, భక్తులకు స్వామివారి దర్శనం కలిగేది కేవలం కొద్ది క్షణాలు మాత్రమే. కానీ, ఈ అష్టాభిషేక సేవలో పాల్గొంటే భక్తులకు శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనం “అర నిమిషం నుండి కొద్ది నిమిషాల వరకు” చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అదృష్ట అవకాశం పొందడానికి రుసుము 6 వేల రూపాయల భారీ ఖరీదు అయినప్పటికీ, భక్తులు ఆ మొత్తం చెల్లించి పాల్గొనేవారు.

అష్టాభిషేక టికెట్లపై కేరళ హైకోర్టు నిబంధన:

- Advertisement -

ఇప్పటివరకు కావలసినన్ని టికెట్లు జారీ చేసిన ఆలయం, ఇకపై కేవలం 15 టికెట్లు మాత్రమే జారీ చేస్తోంది. అది కూడా 10 ఆన్లైన్ అయితే, మిగతా 5 ఆఫ్ లైన్. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే భక్తులు www.sabarimala online.org వెబ్ సైట్ లో టికెట్ పొందాలి. ఆఫ్ లైన్ లో తీసుకోవాలనుకున్న భక్తులు, స్వామివారి సన్నిధానం పక్కన ఉన్న ఆలయ కౌంటర్లో సంప్రదించాలి. భక్తులు అధిక సంఖ్యలో అష్టాభిషేకం సేవలో పాల్గొంటున్న సందర్భంగా ఇతర భక్తులకు స్వామివారి దర్శనానికి ఇబ్బంది పడుతున్నారని హైకోర్టులో ఒకరు పిటిషన్ వేశారని అక్కడివారు చెబుతున్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసిందని ఆలయ పిఆర్ఓ సునీల్ చెప్పుకొచ్చారు. ఈ నిబంధన, రద్దీ అధికంగా ఉండే జనవరి మాసం వరకే అమలులో ఉంటుందని ఆయన చెప్పారు.
పరమ పవిత్రం, మహా మహిమాన్విత్వం అయినటువంటి ఈ యొక్క సేవకు సంబంధించి
ఒక్క టికెట్టు పై 4 నుండి దాదాపు ఆరుగురు భక్తులను అనుమతిస్తామని, అష్టాభిషేక సమయం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. వివిధ వివిధ రాష్ట్రాల నుండి స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు ఈ యొక్క విషయాన్ని గమనించి తమతో సహకరించాలని సునీల్ కోరారు.

ఇతర సమాచారం:

స్వామి వారి దివ్య సన్నిధానం తెరిచి ఉండే సమయాలు ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో మొదలయ్యే స్వామివారి దర్శనం రాత్రి 11 గంటలకు హరివరాసనంతో ఆ రోజుకి ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 3:30 నుండి 4 గంటల వరకు జరిగే గణపతి హోమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి భక్తులు విధిగా 375 రూపాయలు ముందుగానే చెల్లించి టికెట్ తీసుకోవాలి. పుష్పాభిషేకానికి ధర 12,500 ఉండగా అందులో ఐదుగురు భక్తులను అనుమతిస్తామని సునీల్ వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా సత్రాలు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు www.onlinetdb.com వెబ్సైట్ నుండి పొందవచ్చు. మధ్యాహ్నం వరకు కొనసాగే “ఇరుముడి నెయ్యాభిషేకం” ఉదయం 3:30 కు ప్రారంభమవుతుంది.

ప్రత్యేక విన్నపం:

శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్య మంగళ స్వరూపం మరియు గర్భగుడి పరిసర ప్రాంతాలు మొబైల్ ద్వారా చిత్రీకరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని, అలాగే శబరిమలలో ప్లాస్టిక్ వాడకం నియంత్రించానని ఆలయం వారు భక్తులకి ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. వీటిని పాటించకపోవడం అటు కేరళ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రకృతి మరియు స్వామివారి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని వాళ్ళు ముందు మాటగా చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు