Friday, May 3, 2024

ప్రధాన ఉపాధ్యారాయులను తొలగించడంతోధర్నా నిర్వహించిన విద్యార్థినీలు

తప్పక చదవండి

కొండమల్లేపల్లి : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో గల ఎస్సి బాలికల గురుకులలో ప్రిన్సిపాల్‌ గా విధులు నిర్వర్తిస్తున్న విజయకుమారి మేడం నీ తిరిగి విధులల్లోకి తీసుకోవాలని విద్యార్థినిలు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. మా మేడం మాకు కావాలని, వివాంట్‌ జస్టిస్‌ అనే నినాదాలతో ధర్నా నిర్వహించారు. మా ప్రిన్సిపాల్‌ గత కొన్ని సంవత్సరాలుగా మా బాబులు కన్న తల్లిదం డ్రుల కంటే ఎక్కువగా మాపై దృష్టి పెట్టి మా చదువులు మా ఆరోగ్యంతో పాటు అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్న ప్రిన్సిపాల్‌ ను తొలగించడం చాలా బాధాకరమైన విషయమని, జరిగిన సంఘటన ఏదైనా ఉండొచ్చు. మా తోటి విద్యార్థిని ఉదయం ప్రార్థన చేసిన సమయంలో స్పృహ కోల్పోవడంతో హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రభుత్వ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం గుండెపోటుతో మృతి చెందని వివరిం చారు.ఇలాంటి తరుణంలో ఇలాంటి నిజనిర్ధానాలు తేలకముందే ప్రధానోపాధ్యాయులు తొలగించడం ఎంతవరకు సబబు అని ప్రధా న ఉపాధ్యాయులుకు వెళ్లకుండా అడ్డు నిలుస్తూ కన్నీటి పర్వతం విద్యార్థులు కావడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు కోసం విద్యార్థినిలు భవ్య శ్రీ, రేణు శ్రీ, ప్రత్యూష, స్పందన మాట్లాడుతూ. మా మేడం మా కోసం అన్ని విధాలుగా మాకు సహకరిస్తూ మా చదువులో ఉన్నత చదువు కోసం పాటుపడుతున్న మా టీచర్‌ న ఇక్కడ నుండి తొలగించడం ఎంతో బాధాకరమైన విషయమని ఎస్సీ గురుకుల సెకరెటరీ ఇలాంటి నిజ నిర్ధారణాలు తేలకుండానే మా ఉపాధ్యాయులు ఎలా సస్పెండ్‌ చేస్తారని నిందిస్తూ. జస్టిస్‌ అనే నినాదాలతో పాఠశాల ఆవరణలో పోరెత్తడం జరిగింది.మేడం మాకు ప్రతి రోజు పార్ధన సమయంలో మా చదువు,హెల్త్‌ గురుంచి ఎన్నో మంచి విషయాలు చెప్పేది అని తెలిపారు.మాపై ప్రత్యేక శ్రద్ధ చూయించేది కావున మా ప్రిన్సిపాల్‌ మేడాన్ని మా పాఠశాలకు మల్లి పంపించాలి ఆవేదన వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు