Sunday, October 6, 2024
spot_img

అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే ఉపేక్షించేది లేదు

తప్పక చదవండి
  • డిప్యూటీ కమిషనర్‌ అరుణ..
  • ప్రభుత్వ నియమ, నిబంధనలు, అనుమతుల మేరకే నిర్మాణాలు నిర్మించాలి
  • అక్రమాలకు పాల్పడితే కూల్చివేస్తాం..

సరూర్‌ నగర్‌ : సరూర్‌ నగర్‌ సర్కిల్‌-5 పరిధిలో కొందరు ప్రభుత్వ నియమ నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు నిర్మిస్తున్నారు.. అక్రమ నిర్మాణాలపై పలు దిన పత్రికలో వార్త కథనాలు ప్రచురించబడ్డాయి… అక్రమ నిర్మాణాల కథనాలపై సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 డిప్యూటీ కమిషనర్‌ అరుణ.. స్పందించి గడ్డిఅన్నారం డివిజన్‌ పరిధిలోని శివ గంగ సినిమా హల్‌ పక్కన అక్రమ షేడ్‌ నిర్మాణం కొనసాగుతుంది.. ఈ అక్రమ షేడ్‌ నిర్మాణం పై నోటీసులు జారీ చేశారు… నోటీసుల అనంతరం అక్రమ షేడ్‌ నిర్మాణాన్ని కూల్చివేశారు… ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వం నుండి తీసుకున్న అనుమతుల మేరకు నిర్మాణాలు నిర్మించాలని లేని యెడల అక్రమ నిర్మాణాలను నిర్మిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.. అక్రమ నిర్మాణాలపై త్వరలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని అన్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు