Saturday, May 4, 2024

పనిలో నైపుణ్యం ఉండాలి.. టీమ్‌గా పని చేయాలి

తప్పక చదవండి
  • పోలీసు అధికారుల సమీక్షా సమావేశం
  • మహిళా సంబంధ కేసుల్లో అలసత్వం ఉండొద్దు.
  • జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే.

సూర్యాపేట : పనిలో నైపుణ్యం ఉండాలని, టీమ్‌ గా ఏర్పడి పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం లో అదనపు ఎస్పి నాగేశ్వరావుతో కలిసి పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు.గత నెలలో జరిగిన కేసుల నమోదు, కేసుల దర్యాప్తు, పెండిరగ్‌ కేసులు, కోర్టు విధులు, కేసుల్లో శిక్షల అమలు, క్వాలిటి ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, సీసీ టి.ఎన్‌.ఎస్‌ అన్‌-లైన్‌ అప్లోడ్‌, ఈ పెట్టి కేసులు, ఈ చలాన్‌, రౌడీ షీట్స్‌, సస్పెక్ట్‌ షీట్స్‌ అప్డేట్‌ లాంటి అమశాలపై చర్చించి సూచనలు చేయడం జరిగినది. పెండిరగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్‌.ఐ లకు,సి.ఐ లకు తెలిపినారు.

డిఎస్పీ లు నిత్యం పర్యవేక్షణ చేయాలని అన్నారు. మహిళా సంభందిత కేసుల్లో ముఖ్యంగా మిస్సింగ్‌ కేసుల్లో అలసత్వం లేకుండా చర్యలు తీసుకోవాలని, మహిళా బాదితులకు త్వరితగతిన న్యాయం జరగి, నేరస్తు లకు శిక్షలు పడితే మహిళలపై జరిగే దాడులు, నేరాలు తగ్గుతాయి అని అన్నారు. మహిళలకు బారోసా రక్షణ పెరుగుతుంది అని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రణాళిక ప్రకారం పని చేయాలని ఆదేశించారు.ఎప్పటికప్పుడు పనిలో నైపుణ్యం సాధించాలని, అందరూ ఒక టీమ్‌ గా పని చేసి లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. పోలీసు పని విభాగాలను, పిటిషన్‌ మేజ్మెంట్‌ సిస్టం ను సమర్థవంతంగా నిర్వర్తిం చాలి, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు నాగభూషణం, ప్రకాష్‌, డి.సి.ఆర్‌.పి డి.ఎస్పి. రవి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్పెక్టర్‌ లు రాజేష్‌, మహేష్‌, సిసిఎస్‌ ఇన్స్పెక్టర్‌ నాగార్జున, సిఐ లు శివ శంకర్‌, రాజశేఖర్‌, మురారి, రాము, వీర రాఘవులు, ఎస్‌ఐ లు సిబ్బంది ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు