Sunday, July 21, 2024

పేదల భూములను స్వాహా చేసేందుకు అధికార పార్టీ సర్పంచ్‌ కుట్ర

తప్పక చదవండి
  • ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా వక్రీకరించి నాటకం..
  • వత్తాసు పలుకుతున్న అధికారులు

వేరే సర్వే నంబర్‌ను ప్రభుత్వ భూమిలో చూపించి పట్టా చేయించిన వైనం..
మిర్యాలగూడ మండలం జంకుతండా సర్పంచ్‌, అధికార పార్టీ నేత మాలోత్‌ రవీందర్‌ నాయక్‌ పేదల అధీనంలో వున్న భూమిని ప్రభుత్వ భూమిగా పట్టా భూమిగా భుచిగా చూపి గ్రామ పంచాయితీ భవన నిర్మాణం పేరుతో స్వాహా చేసేందుకు కుట్ర చేస్తున్నాడు. ఆదివారము స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుల పక్షాన భాదితుడిగా మాలోత్‌ బాలాజీ నాయక్‌ మాట్లాడారు. గత 40 సంవత్సరాల నుండి తాము స్వాధీనంలో, కబ్జాలో ఉన్న భూమిని మొదట్లో ప్రభుత్వ భూమి అని బలవంతంగా శుభ్రం చేయిస్తే అడ్డుకున్నమని, దాంతో మళ్ళీ పట్టా భూమి అని పేర్కొంటూ వేరే సర్వే నంబర్స్‌లో వున్న వారితో దొంగ పట్టా చేయించి మా అధీనంలో ఉన్న భూమిని స్వాహా చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. అధికార పార్టీ సర్పంచ్‌ కు రెవెన్యూ అధికారులు వత్తాసు పలకడం తగదన్నారు. నిన్నటి వరకు 65 వ సర్వే నంబర్‌ అని అది ప్రభుత్వ భూమి అని చెప్పి అదే భూమిని పట్టా భూమి అని చెప్పి ఎలా పట్టా చేస్తారని ప్రశ్నించారు.45 సర్వే నంబర్‌ భూమి మరో చోట ఉన్నదని అట్టి భూమిని పేదల అధీనంలో ఉన్న భూమిలో చూపించి సర్పంచ్‌ ఎకరం భూమికి పైగా స్వాహా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ లేదా పట్టా భూమిలో ఉన్న పేదలను తొలగించాలంటే మొదట నోటీసు ఇవ్వాలని ఆనంతరం తొలగించాల్సి ఉన్నదని చెప్పారు. భూమి స్వాహా కుట్రపై ఉన్నత అదికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి ఎమ్మేల్యే భాస్కర్‌ రావు జంకు తండ, వెంకటాద్రిపాలెం గ్రామ సర్పంచ్లు,పెద్దమనుషులు చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన మరో ప్రదేశంలో నిర్మాణానికి అమోదం తెల్పితే సర్పంచ్‌ రవీందర్‌ నాయక్‌ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకే వివాదం ఉన్న స్థలం పట్టా చేయించుకొని గ్రామ పంచాయితీ భవనం పేరుతో భూమి స్వాహా కుట్ర పన్నుతున్నారని వాపోయారు.అదేవిధంగా పేదల అధీనంలో ఉన్న భూమిని లాక్కోవద్దని హైకోర్టులో జAూజు చీఖవీదీజుR ఔూ 16239/2023 కేసు సైతం వేశామని ఈ విషయమై వివరణ ఇచ్చిన అనంతరము చర్యలు తీసుకోవాలని కోర్టు కలెక్టర్‌, అర్డిఓ, ఏంఅర్‌ఓ, పంచాయతి సెక్రటరీ లకు నోటిసులు జారీచేసిన రెవెన్యూ అధికారులు భూమిని ఎలా పట్టా చేశారని ప్రశ్నించారు. మరో వైపు 45వ సర్వే నంబర్‌ లో భూముల హద్దులు నిర్ణయించలేదని దాంతో నాకు భూమి తక్కువ ఉన్నదని, కొత్తగా కొనుగోలు విక్రయాలు చేయరాదని 45వ సర్వే నంబర్‌ పట్టా యాజమాని పిర్యాదు చేసినా విచారణ జరపకుండా ఎంఅర్‌ఓ భూమి పట్టాను ఎలా చేశారని ప్రశ్నించారు. ఇంకో వైపు కబ్జాలో ఉన్న భాదితులు జీఓ నంబర్‌ 59 ప్రకారం పట్టాచేయాలని దరఖాస్తులు సైతం చేసినట్లు చెప్పారు.పేదలమైన తాము భూములని వదులుకు నేందుకు సిద్ధంగా లేమని ఎంతకైనా పోరాడి సాధించుకుంటామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పేదల భూములను కాపాడే విశయంలో మద్దతు పలకాలని కోరారు. సమావేశంలో భాదితులు హరి నాయక్‌, రామి, శారద, పిక్లి, పద్మ, సీతాలి, సరోజ, రజినీ తదితురులున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు