Friday, May 17, 2024

కేసీఆర్ అరోగ్య పరిస్థితిపై రేవంత్ స్పెషల్ కేర్

తప్పక చదవండి
  • మెరుగైన వైద్యం కోసం ఓ అధికారికి బాధ్యతలు
  • ఫాంహౌస్ బాత్రూంలో జారిపడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
  • ఎడమ తుంటికి తీవ్ర గాయమైనట్టు నిర్దారణ
  • హిప్ రీప్లేస్‌మెంటరీ సర్జరీ చేయనున్న వైద్యులు
  • యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
  • కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎంకు వివరించిన వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. బాత్‌రూమ్‌లో జారిపడటంతో ఆయనకు గాయమైందని పేర్కొన్నారు. సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు నిర్వహించామని, ఆయన ఎడమ తుంటికి గాయమైందని, హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. శస్త్ర చికిత్స తర్వాత మాజీ సీఎం కోలుకోడానికి 6-8 వారాలు పడుతుందని హెల్త్ బులిటెన్‌లో తెలియజేశారు. ఆర్ధోపెడీషియన్, అనెస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ సహా బహుళ విభాగాలకు చెందిన వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు. గురువారం రాత్రి కాలుజారి పడటంతో బీఆర్ఎస్ అధినేతకు గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను చేర్పించారు.

మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. అంతేకాదు, యశోద ఆస్పత్రికి ఆరోగ్య శాఖ కార్యదర్శిని పంపి.. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఆస్పత్రివద్ద భద్రత పెంచనున్నారు. అటు, కేసీఆర్‌కు గాయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని.. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు