Sunday, July 21, 2024

నైతిక విలువలే విద్యార్థి ఉన్నతికి సోఫానం

తప్పక చదవండి
  • సంగం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ : విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, నైతిక విలువలు కలిగి ఉండాలని అప్పుడే ఉన్నత విజయాలు సాధిస్తారని సంగం పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సుజాత నాయుడు సయన అన్నారు. ఎప్‌.ఈ.ఐ. విద్యాసంస్థల అనుబంధ శాఖ క్రీక్‌ ప్లానెట్‌ స్కూల్‌ వీనస్‌ క్యాంపస్‌ నందు’’ సంగం’’ పేరుతో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మంచి భావాలే బాటలు వేస్తాయని వారి అమూల్య మైన సందేశాన్ని అందించారు. ’’కాస్మిక్‌ లాంబిగస్‌’’ అనే థీమ్‌ ఆధారంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యంతం ఆహుతులను అలరించాయి. ‘‘ప్లాస్టిక్‌ రీయూజ్‌తో చేసిన మోడల్స్‌ చూపరులను ఆనందింపజేసి, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రతిభను తిలకించడానికి భారీగా తరలివచ్చారు. పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ము గ్ధులయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత నాయుడు సయన, ఉప ప్రధానోపా ధ్యాయురాలు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు