Friday, May 17, 2024

కోలుకున్న మాజీ సిఎం కేసీఆర్‌

తప్పక చదవండి
  • నేడు యశోదా నుంచి డిశ్చార్జ్‌
  • నందినగర్‌ ఇంటికి వెళ్లేందుకు నిర్ణయం

హైదరాబాద్‌ : తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం డిశ్చార్జ్‌ కానున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడడంతో కేసీఆర్‌ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కెసిఆర్‌ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు. సుమారు 6 రోజులుగా యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్‌ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ఆస్పత్రి వర్గాలు ఇంటికి వెల్లడానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కేసీఆర్‌ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం కేసీఆర్‌ ను డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే కేసీఆర్‌ ప్రగతి భవన్‌ ను ఖాళీ చేసి ఫామ్‌ హౌస్‌ కు వెళ్లారు. అయితే వైద్య సేవల కోసం ఫామ్‌ హౌస్‌ దూరంగా ఉండటంతో.. ఆయన సిటీలోని తన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నందినగర్‌ లో ఇంటిని యుద్ధప్రాతిపదికన బాగు చేసినట్లుగా తెలుస్తోంది. హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయించుకున్న కేసీఆర్‌ వాకర్‌ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో నడుస్తున్నారు. హాస్పిటల్‌లోని తన రూమ్‌లో వాకర్‌తో కేసీఆర్‌ నడుస్తున్నారు. వేగంగా రికవర్‌ అవుతున్నారని తెలిపారు. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తామని, ఆయన మెడికల్‌గా స్టేబుల్‌గా ఉన్నారని, నార్మల్‌ ఫుడ్‌ తింటున్నారని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని, శరీరం ఇట్లాగే సహకరిస్తే వేగంగా ఆయన సొంతంగా నడిచే అవకాశం ఉంది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూండటంతో ఇక ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని డాక్టర్లు భావిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పరామర్శించేందుకు ప్రముఖులు వస్తున్నారు. వారితో యశోదాలో రోగులకు ఇబ్బంది ఎదురవుతోంది. రావొద్దని కూడా కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌కు ఆపరేషన్‌ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని ప్రకటించారు. వారం కిందట ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ జారిపడటంతో ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు తరలించారు. కేంద్రమంత్రిగా ఉన్న సమయమంలోనూ కేసీఆర్‌ ఓ సారి ఢల్లీిలో బాత్‌ రూంలో జారి పడ్డారు. దాంతో అప్పుడు కూడా ఆయనకు తుంటి ఆపరేషన్‌ జరిగింది. ఈ సారి రెండో వైపు ఆపరేషన్‌ జరిగింది. అయినా కేసీఆర్‌ మానసికంగా ధృడంగా ఉన్నారని.. ఆస్పత్రిలో పుస్తకాలు చదువుతున్నారని ఎంపీ సంతోష్‌ రావు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు