Friday, May 3, 2024

మహిళా బిల్లుకు రాజముద్ర..

తప్పక చదవండి
  • ఆమోదించిన రాష్ట్రపతి
  • ఇది చారిత్రాత్మకం అంటున్నవిశ్లేషకులు..
  • జండర్‌ న్యాయం కోసం మన కాలంలోని అత్యంత పరివర్తనాత్మక విప్లవం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూ ఢిల్లీ : మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొందిన నారీ శక్తి వందన్‌ చట్టం బిల్లును తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ బిల్లు సెప్టెంబర్‌ 20న లోక్‌సభలో, సెప్టెంబర్‌ 21న రాజ్యసభలో ఆమోదం పొందింది. ఏదైనా బిల్లు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. అది చట్టంగా మారేలా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పుడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జండర్‌ న్యాయం కోసం మన కాలంలోని అత్యంత పరివర్తనాత్మక విప్లవం అని అన్నారు. ప్రభుత్వం ఇటీవల సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో రెండు చారిత్రక విషయాలు జరిగాయి.రెండోది మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. నారీ శక్తి వందన్‌ చట్టం బిల్లు పేరుతో ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును సెప్టెంబర్‌ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రెండు రోజుల పాటు సభలో చర్చ సాగింది. చాలా పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలికాయి. సెప్టెంబర్‌ 20న లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా మరో రెండు ఓట్లు వచ్చాయి. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నిరసనగా ఓటు వేయగా, ఆయన పార్టీకి చెందిన మరో ఎంపీ విపక్షంగా ఓటు వేశారు. చివరకు మూడిరట రెండొంతుల మెజారిటీతో బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు