Sunday, May 19, 2024

పైరవీ కొట్టు… కొలత తక్కువ పెట్టు…

తప్పక చదవండి
  • జాన్‌ పహాడ్‌ రోడ్డు వెడల్పులో భారీగా కొలతలు తేడా, కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం
  • పట్టించుకోని ఇంజనీరింగ్‌, మున్సిపాలిటీ అధికారులు

నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ లోజానపహాడ్‌ రోడ్డులో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులలలో ఒక్కో చోట ఒక్కో కొలతతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌,వాళ్ళ అసిస్టెంట్లను పెట్టి రోడ్డు వెడల్పు పనులు ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని నష్ట పోయిన షాప్‌ యజమానులు ఆరోపిస్తున్నారు. రోడ్డు వెడల్పు మొత్తం 66 ఫీట్లు ఉండగా రోడ్డు సెంటర్‌ నుంచి రెండు పక్కల రైట్‌ సైడ్‌ 33 ఫీట్లు లెఫ్ట్‌ సైడ్‌ 33 ఫీట్లు పెట్టి డ్రైనేజీలు పోయాల్సి ఉండగా కొంతమంది రాజకీయ నాయకుల పైరవులతో ఒక షాపు దగ్గర 30 ఫీట్లు పెట్టి డ్రైనేజ్‌ పోస్తున్నారు. ఇంత కొలతలు తేడా పెట్టి పోస్తున్నారని పనిచేస్తున్న సిబ్బందిని అడగగా,మా సార్‌ ఈ విధంగానే కొలతలు చెప్పారని సమాధానం చెప్తున్నారని షాపుల యజమానులు చెప్తున్నారు. రెండు వైపులా సమాన కొలతలు పెట్టి పని చేయాలని,లేకపోతే పనులు నిలుపుదల చేయాలని,కొలతలలో తేడా వల్ల, తమ స్లాబ్‌ పోర్టుకోలు కట్‌ చేస్తారని కొలతలు తేడా ఉంటే లోపటికి పోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా అధికారులు స్పందించి జానపహాడ్‌ రోడ్లో అన్ని సమాన కొలతలు పెట్టి రోడ్డు వెడల్పు పనులు చేయాల్సిందిగా నష్టపోతున్న షాపు యజమానులు కోరుతున్నారు.ముఖ్యంగా జానపహాడ్‌ రోడ్డు నుండి బంగారం షాపులకు వెళ్లే మూలమలుపులో ఉన్న షాపులలో కొలతలు 30 అడుగులకు తక్కువగానే ఉన్నాయని,అధికారులు,నాయకులు పైరవీలతో పనులు జరుగుతున్నాయని, ఇకనైనా ఇంజినీరింగ్‌ అధికారులు జరుగుతున్న అవకతవకలు గుర్తించి అందరికి సమానంగా కొలతలు పెట్టి పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు