Thursday, May 16, 2024

యువగళం పాదయాత్ర వాయిదా

తప్పక చదవండి
  • చంద్రబాబు కేసులతో ఢిల్లీ లోనే లోకేశ్‌ మకాం..
  • న్యాయవాదులతో సంప్రదింపులతో బిజీ
  • పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు వాయిదా.. త్వరలోనే తేదీ ఖరారు

అమరావతి : నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగింపు వాయిదా పడిరది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు వల్ల పాదయాత్ర తేదీని మార్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు విచారణ ఉన్నందున యువగళం పాదయాత్ర కొనసాగింపునకు ఆటంకం ఏర్పడిరది.. ఈ మేరకు యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు టీడీపీ అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించాలని అనుకుంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం.. యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. చంద్రబాబు అరెస్టు, తర్వాత జరిగిన పరిణామాల వల్ల సెప్టెంబరు 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రని నిలిపివేశారు. దాదాపు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, అక్టోబర్‌ 3న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు పిటిషన్‌ సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలే లోకేశ్‌ని కోరారు. ప్రస్తుతం లోకేశ్‌ ఢిల్లీలో ఉండి కేసు విషయంలో న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ ఇబ్బంది అవుతుందని లోకేశ్‌ కు పార్టీ నేతలే చెప్పారు. వారి సలహాలను స్వీకరించిన లోకేశ్‌.. యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పాదయాత్ర తేదీలను ఖరారు చేయనున్నారు.మరోవైపు కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తెచ్చి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని టీడీపీ నేతలు కన్నెర్రజేస్తున్నారు.
ఈ సమయంలో లోకేష్‌ ఢిల్లీలో ప్రతినిత్యం అడ్వకేట్లతో సంప్రదింపులు చేయడం చాలా అవసరమని టీడీపీ ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదుల తో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేష్‌తో ముఖ్యనేతలు చెప్పగా.. యువనేత పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. లోకేష్‌ను కూడా అక్రమంగా అరెస్టు చేస్తే.. అదే ముహూర్తానికి పాదయాత్ర మొదలుపెట్టేందుకు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సిద్ధమయ్యారు.
ఆమెకు ఇప్పటికే అన్ని విషయాలను కుటుంబసభ్యులు వివరించినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ప్రజల్లో సానుభూతి ఎక్కువగా వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక బ్రాహ్మణి పాదయాత్ర అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అధికారపార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి వస్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊహించినదానికంటే ఎక్కువగా నిరసనలు, సానుభూతి ఉందనేది అధికారపార్టీ ఎమ్మెల్యేల మాట. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను అక్టోబరు3న విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. తనపై నమోద్కెన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు