Tuesday, May 14, 2024

పటేల్‌ గూడ కార్యదర్శి సస్పెండ్‌.

తప్పక చదవండి
  • ఆదాబ్‌ ఎఫెక్ట్‌..

హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా, అమీన్‌ పూర్‌ మండలం, పటేల్‌ గూడ గ్రామ పంచాయితీ పరిధిలో ప్రభుత్వ స్థలంలో కడుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి జూలై 12 రోజున ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ తెలుగు దినపత్రికలో ‘ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేస్తే తప్పేంటి’ అని ప్రచురించిన కథనంపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారిని విచార ణకు ఆదేశించారు.. విచారణ అనంతరం నివేదిక ఆధారంగా పటేల్‌ గూడ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ.. జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.. దీనితో విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులలో భయం మొదలైంది.. అధికారిపై చర్యలతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తారా..?లేక ప్రేక్షక పాత్ర వహిస్తారా..? సంగారెడ్డి జిల్లా డి.ఎల్‌.పి.ఓ, డి.పి.ఓ.లు ఇప్పటికైనా చర్యలు అమలు చేస్తారా..? లేక పటేల్‌ గూడ కార్యదర్శిలా విధులు వెలగబెడుతారా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది..అమీన్‌ పూర్‌ మున్సిపల్‌ కార్యాలయ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి.. కార్యాలయ అధికారుల కను సన్నల్లో జరుగుతున్న అక్రమాలు, గుడిస్థలం కబ్జా విషయంపై, అక్రమ అనుమతులపై, మరికొంత మంది అవినీతి అధికారుల వ్యవహారాన్ని మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకునిరానుంది.. ‘ ఆదాబ్‌ హైదరాబాద్‌’ ‘ మా అక్షరం అవినీతిపై అస్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు