Sunday, May 19, 2024

చట్ట విరుద్ధమైన సెల్లార్లు ఆపాలి..

తప్పక చదవండి

మణికొండ : మణికొండ మున్సిపల్‌లోని వార్డు 8లోని అల్కా పుర్‌ రోడ్‌ నెంబర్‌ 22 లో 900 గజాల స్థలం కలిగిన ప్లాట్‌ నెంబర్‌ 292, 293 లో మార్స్‌ ఇన్ఫ్రా, శాన్వి ఇన్ఫ్రా సెల్లార్‌ తవ్వకాలు మొదలు పెట్టారని ప్రక్కనే వున్న ప్లాట్‌ నంబర్‌ 285, 286, 287 లోని అపార్ట్మెంట్‌ జే.ఎస్‌.ఆర్‌ బ్లూమ్స్‌ ఓనర్స్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారు గత నెల 1 వ తేదీన నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌ తవ్వడంతో తమకు ఎదో ప్రమాదం జరగ బోతుందని ఊహించి మున్సిపల్‌ అధికారుల దృష్టికి లెటర్‌ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారని వార్డు కౌన్సిలర్‌ నవీన్‌ కుమార్‌ తెలిపారు. అయన మాట్లాడుతూ లెటర్‌ ఇచ్చిన తరువాత స్పందించి అక్కడకు వచ్చిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వాళ్ళ ఫ్లాట్‌లో వాళ్ళు సెల్లార్‌ తీసు కుంటే మీకేంది ప్రాబ్లం అని వారికి వాత్తసు పలుకడంతో త్రవ్వడం ఆపాల్సిన అవసరం లేదని చెప్పిరని తమ వద్దకు వచ్చా రన్నారు. ఈ విషయమై శోధించి చూడగా సదరు బిల్డర్‌ కి నిర్మాణ అనుమతి లేదు అని తెలిసిం దన్నారు. అదే విషయమై కమిషనర్‌ ను వివరము అడుగగా సెల్లార్‌ తవ్వడం , కట్టుబడి చేసే వారిపై ఎఫ్‌.ఐ.ఆర్‌ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు గాను వెంటేనే పనిని ఆపించమని లేని ఎడల జే.ఎస్‌.ఆర్‌ బ్లూమ్స్‌ అపార్ట్మెంట్‌ కు ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలి పారు. అనుమతి కూడా లేని సదరు బిల్డర్‌ పనులు ఆపకుండా, మున్సిపల్‌ వారు ప్రజల ప్రాణాలను ఫణంగా ఎందుకు పెడుతున్నారో అర్ధం కావడం లేదని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు