- మెన్స్ ట్రాప్ ఈవెంట్‌లో క్యాన్ చెనాయ్‌కి కాంస్యం..
హాంగ్జౌ : చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత షూటర్‌లు పతకాల సంట పండిస్తున్నారు. ఇప్పటికే 7 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు తమ ఖాతాలో వేసుకున్న భారత షూటర్లు ఇప్పుడు మరో పతకం సాధించారు. మెన్స్ ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో షూటర్ క్యాన్ చెనాయ్ 32/40 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు.
ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్ జొరావర్ సింగ్ సంధూ 23/40 స్కోర్‌తో ఐదు స్థానంతో సరిపెట్టుకున్నాడు. చైనాకు చెందిన క్వి యింగ్ 46 స్కోర్‌తో అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా, కువైట్‌కు చెందిన అల్‌రష్దీ తలాల్ రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. కాగా 19వ ఏషియాడ్‌లో భారత్ ఇప్పటి వరకు 42 పతకాలు సాధించింది.