Sunday, May 19, 2024

ఇంజనీరింగ్‌లో ఫైనాన్స్‌ కోర్సు..

తప్పక చదవండి
  • సరికొత్త అధ్యాయానికి తెరతీసిన విద్యాశాఖ..

హైదరాబాద్‌ : భిన్న కాంబినేషన్ల మేళవింపుతో బీటెక్‌ ప్రోగ్రాముల్లో సాంకేతిక విద్యను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంస్కరణలు, మల్టీ డిసిప్లినరీలో భాగంగా బీటెక్‌లోనూ ఫైనాన్స్‌ కోర్సును అంతర్భాగంగా చేర్చారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఈ, బీ టెక్‌ ప్రోగ్రాముల్లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణ యం తీసుకున్నారు. దీంట్లో భాగంగా బీటెక్‌ స్పెషలైజేషన్‌ను మేజర్‌గా, ఫై నాన్షియల్‌ సర్వీసెస్‌ను మైనర్‌ కోర్సు గా విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. ఈ విద్యాసంవత్సరం లేదా వచ్చే ఏ డాది నుంచి ఈ కోర్సు అందుబాటులోకి వస్తుంది. ఇటీవల బ్యాకింగ్‌ అం డ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం హవా సాగుతున్నది. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. దీంతో వి ద్యార్థులు వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్రం కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. బీ కాం, బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సుల్లో చేరుతున్నారు. ఈ దశలో డిగ్రీలో బీకాం కోర్సుకు ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ ప్రోగ్రాముల్లో మార్పుల్లో భాగంగా విద్యాశాఖ బీటెక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సును కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి ఉస్మానియా, జేఎన్టీయూ వర్సిటీల్లో మైనర్‌ కోర్సుగా ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ దిశలో విధివిధానాలు, పాఠ్యాంశాల రూపకల్పనకు ఇటీవలే వర్సిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల మొదటి వా రంలో మరో సమావేశం జరగనున్న ది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో బీకాం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దోస్త్‌ ద్వారా ఈ కోర్సును అందుబాటులో తీసుకురావాలని భావిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు