Monday, May 20, 2024

మైనంపల్లిపై వేటు పడనుందా…?

తప్పక చదవండి
  • మంత్రి హరీష్‌ రావుపై చేసిన ఘాటు వ్యాఖ్యలను
    బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకుంటారా.. ?
  • మైనంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతారా.. ?
  • లేక కొడుకు భవిషత్తు కోసం కాంగ్రేస్‌ తలుపు తడతారా ?
  • హరీష్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారు.. ?
  • మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి
    పోటీ చేసి మైనంపల్లి గెలిచిన
  • పార్టీలోనూ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోను ఆయనకు ప్రాధాన్యత ఉంటుందా ..?
    హైదరాబాద్‌ : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోనే కాక రాష్ట్రంలోనే తిరుగులేని నాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అధికార పార్టీలో మంత్రికాక పోయినప్పటికీ.. మంత్రికంటే ఎక్కువ చరిష్మా ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. నియోజకవర్గంలో ఆయన మాటకు తిరుగులేదని చెప్పుకుం టుంటారు. సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ కొన్నివేలమంది అయన సహాయం కోసం .. ఆయనతో స్నేహంకోసం పరితపిస్తుంటారు. అయితే ఆయన ఇటీవల తిరుపతిలో మంత్రి హరీష్‌ రావుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. పార్టీ ముఖ్య నేతలు మైనంపల్లి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత కూడా మైనంపల్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తామంతా మంత్రి హరీష్‌రావు వైపే ఉన్నామని చెప్పేశారు.
    బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకుంటారా.. ?మైనంపల్లి రోహిత్‌ భవిషత్తు కోసం మైనంపల్లి హనుమంతరావు మెదక్‌ అసెంబ్లీ సీటును బీఆర్‌ఎస్‌ పెద్దలను అడిగినట్లు సమాచారం..అయితే తొలుత సూచన ప్రాయంగా ఒప్పుకున్న పెద్దల మాటలు విని మైనంపల్లి కుమారుడు రోహిత్‌ మెదక్‌ లో పలు సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యారు. దీంతో నియిజకవర్గంలో రోహిత్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో మైనంపల్లి హనుమంత రావు తన కుమారుడికి బీఆర్‌ఎస్‌ పెద్దలు అవకాశం ఇస్తారని ఆశించారు. కానీ ఆయన ఆశలకు బిన్నంగా కేసీఆర్‌ టికెట్‌ పద్మాదేవేందర్‌ కు కేటాయించారు.. దీంతో అయన ఒకింత అసహనానికి లోనయ్యారని తెలుస్తోంది. కుమారుడి టిక్కెట్టు రాకపోవడానికి హరీష్‌ కారణమని ఆయనపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. పార్టీయే కూడా మైనంపల్లి మాటలను సీరియస్‌ గానే తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మైనంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతారా? లేక పార్టీ మార్పుపై కీలక ప్రకటన చేయబోతున్నారా? అనేదితేలాల్సివుంది.
    మైనంపల్లిపై వేటు తప్పదా ..? మైనంపల్లి హన్మంతరావు హరీష్‌ రావుపై చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనిపై త్వరలో వేటు పడుతుందని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.అయితే ఈ జాబితాలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావు పేరును కూడా కేసీఆర్‌ ప్రకటించారు. అయితే, మైనంపల్లి హరీష్‌ రావుపై చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారని విలేకరులు ఓ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ను ప్రశ్నించారు..అయితే కేసీఆర్‌ ఘాటుగా స్పందిస్తూ.. టికెట్‌ ఇచ్చా పోటీ చేయడం చేయకపోవటం ఆయన ఇష్టం అంటూ నిర్ణయాన్ని మైనంపల్లికే వదిలేశారు. మైనంపల్లిపై ప్రస్తుతం అధిష్టానంతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఒకవేళ మైనంపల్లి మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన పార్టీలోనూ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోను పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మైనంపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠతను రేపుతోంది.
    హరీష్‌రావుపై తాను చేసిన వ్యాఖ్యలపై మైనంపల్లి స్పందించారు…
    హరీష్‌రావుపై తాను చేసిన వ్యాఖ్యలపై మైనంపల్లి మంగళవారం స్పందించారు. నేను ఎవరి జోలికి వెళ్లను.. నా జోలికి వస్తే ఊరుకోను. నేను హార్డ్‌ వర్కర్‌ని నమ్ముతాను. మా అబ్బాయి పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యాడు . నా కొడుక్కి నా అవసరం ఉంది. తప్పకుండా నా కొడుక్కి నేను సపోర్ట్‌ చేస్తా అని మైనంపల్లి చెప్పారు. తిరుమలలో నా ఫీలింగ్స్‌ చెప్పుకోవడంలో తప్పులేదు. నా జీవితంలో నేను ఎవరిని ఇబ్బంది పెట్లలేదు. నన్ను ఇబ్బంది పెడితే ఊరుకోను.. అది నా విధానమని చెప్పారు.పార్టీ గురించి నేను మాట్లాడలేదు. ఈ రోజుకూడా పార్టీ గురించి మాట్లాడను. మెదక్‌ నియోజకవర్గం నాకు రాజకీయ బిక్ష పెట్టింది నాకు కార్యకర్తలు ముఖ్యం. మల్కాజిగిరి ప్రజలు నేను ఊహించని విధంగా నన్ను ఆదరించారు. రెండు నియోజకవర్గాల్లో ప్రజలతో, కార్యకర్తలతో మాట్లాడి తర్వాత నా భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా అని మైనంపల్లి హన్మంతరావు చెప్పారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు