- పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచండి
- పోలీస్ స్టేషన్‌ను శుభ్రంగా ఉంచండి
- పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్
- తల్లాడ కల్లూరు పోలీస్ స్టేషన్‌లు ఆకస్మిక సందర్శన
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన వారియర్
తల్లాడ : ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై పోలీస్ సిబ్బంది తక్షణమే స్పందించి వారికి సత్వర పరిష్కారం చూపించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. మంగళవారం నాడుకల్లూరు, వైరా డివిజన్ల పరిధిలోని కల్లూరు, తల్లాడ పోలీస్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆకస్మికంగా సందర్శించారు. అయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో రోల్ క్లారిటీ వుండాలని, అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూపోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు. 5 ఏస్‌అమలులో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్టేషనరీ విభాగం పరిశుభ్రంగా వుంచాలని అదేవిధంగా అవసరమైన రికార్డులు,వస్తువుల క్రమపద్ధతిలో పెట్టడం, పరిసరాలలో సురక్షితమైన ,ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొవాలన్నారు. స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, రెగ్యులర్ రోల్ కాల్, వీక్లీ పరేడ్ గురించి సిబ్బంది అధికారులు విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ఉపయోగాలను స్ధాని కులు వివరించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు పెట్టుకొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమీపంలో నిర్మాణం పూర్తి అయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా వున్న కల్లూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. తల్లాడలో సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.కార్యక్రమంలో కల్లూరు ఏసిపీ రామా నుజం, వైరా ఏసీపీ రహెమన్, సిఐ హానుక్ ఎస్సైలు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-