Sunday, May 19, 2024

మఖ్తల్‌లో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణ..

తప్పక చదవండి
  • మిగతా 12 మంది నామినేషన్లు ఓకే…
  • రిటర్నింగ్‌ అధికారి మయాంక్‌ మిట్టల్‌

మఖ్తల్‌ : మఖ్తల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా… సోమవారం ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ముగ్గురి నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి మయాంక్‌ మిట్టల్‌ తెలిపారు. మిగతా 12 మంది నామినేషన్లు నిబంధనలకు లోబడి ఉన్నాయని, వారి నామినేషన్లు అనుమతించబడినట్లు తెలిపారు. తిరస్కరణకు గురైన వారి జాబితాలో సీపీఐ నుంచి కొండన్న, బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ నుంచి మంజుల, బీఆర్‌ఎస్‌ నుంచి ఎల్లారెడ్డి ఉన్నారు. కొండన్న, ఎల్లారెడ్డి ఫార్మ్‌ ఏ, బీ జత చేయలేదని, దీంతోపాటు ప్రపోజర్ల నిబంధన పాటించలేదని అన్నారు. మంజుల నామినేషన్‌ లో సైతం ప్రపోజర్‌ లేరని, ఫార్మ్‌ బీ పూర్తి చేయలేదని, దీంతో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. మిగతా 12 మంది అభ్యర్థులు కాంగ్రెస్‌ నుంచి వాకిటి శ్రీహరి, బీజేపీ నుంచి జలంధర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, బీఎస్పీ నుంచి వర్కటం జగన్నాథ్‌ రెడ్డి, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గవినోళ్ల వెంకట్రామిరెడ్డి, డీఎస్పీ నుంచి దశరథ్‌, స్వతంత్ర అభ్యర్థులు అనిల్‌, పద్మజ, విష్ణువర్ధన్‌ రెడ్డి, బాలకృష్ణ, భరత్‌ కుమార్‌, లక్ష్మన్న నామినేషన్లు ఆమోదం పొందిన వారిలో ఉన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు విత్‌ డ్రా చేసుకునేందుకు చివరి గడువు ఉందని, ఆ తరువాత తుది అభ్యర్థుల జాబితా తో పాటు, స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు ఉంటుందని తెలిపారు. స్క్రూటినీ ని ఎన్నికల పరిశీలకులు బీఎస్‌ చౌహాన్‌, ఐపీఎస్‌ ధ్రువ్‌ పరిశీలించా

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు