Tuesday, May 7, 2024

కల్లు గీత కార్మికుల ఆవేదన ఎవ్వరికి పట్టదా

తప్పక చదవండి

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిరది కల్లుగీత వృత్తి. దీనినే నమ్ముకుని ఇప్పటికి కొన్నివేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి పల్లెలలో ఈ వృత్తిని నమ్ముకుని ఎక్కువగా ఉన్నారు .ఈవృత్తిని నమ్ముకూని జీవనం కొనసాగించే గీతకార్మికుల కుటుంబాలు పూర్వం చాలా వైభవంగా, ఉన్నతంగాఉండేవి. నాటి గౌడకులవృత్తి వ్యవస్థలో గీతకార్మికుల ేమూలస్థంబాలుగా ఉండేవారు. గీతకార్మికులకు గౌడకులవృత్తికి వీడదీయరాని సంబందం వలనే ‘‘గౌడ్‌ అంటే కల్లు’’ ‘‘కల్లుఅంటే గౌడ్‌ అనే నానుడి వాడుకలో ఉంది. పూర్వం ఈవృత్తికి గౌరవ మర్యాదలు మెండుగా ఉండేవి. నేడు ఆ పరిస్థితులు భిన్నంగా మారి ఆరిపోతున్న ఇంటి దీపాన్నీ కాపాడలేక పోవటామే కాక గీతన్నల బతుకులకు భరోసా కరువై వృత్తికి రక్షణలేకపోయింది. పాలకులకు చిత్తశుద్దిలేకుండా పోయింది.బీరు బ్రాండి రాజ్యమందు ఉండి గీతబతుకులలో మార్పులేక పాలకులకు చిన్న చూపుకు ఎక్కిఎక్కి ఏడ్చిన కష్టజీవుల కల్లుకుండ ఏమి పాపంచేసిందని గీతకార్మికులు ఆవేదన పడుతున్నారు.
నేటి గీతకార్మికుల స్థితిగతులు చిద్రమై, అస్తవ్యస్తంగా ఉన్నాయి. గౌడకులవృత్తి అదమ పాతాళంలో పడిపోయింది. నిత్యం గౌడన్నల మరణవార్తలు చూడని పేపర్లు లేవు.ఆ దయనీయమైన బతుకుల ప్రమాదపు వార్తలు తెలుపని ,చూపని చానళ్ళులేవు. ఇవిచూస్తూ ఏమిచేయలేని నిస్సహయా స్థితిలో గౌడజాతి ఉందనడంలో ఏలాంటి సందేహంలేదు. ఈవృత్తిని 19ఏళ్ళ నుంచి దాదాపు 75 సంవత్సరాల వయస్సు కలవారు సైతం ఈవృత్తిని చేస్తున్నారు. బతుకు జీవన పోరాటంలో ప్రతి రోజుఏదో ఒక మూలన పిట్టలా రాలిపోతున్నారు. తాడు ఎక్కే క్రమంలో మోకుజారిన ,కాలుజారిన, చెట్టువిరిగిన పురుగు ముట్టిన మరుక్షణం ప్రాణం గాలిలో కలుస్తుంది.ప్రాణానికి విలువలేదు.బతుకు మీద నమ్మకంలేదు.ఇంత ప్రమాదమైన వృత్తిని వదులుకోలేక, కుటుంబాలను పోషించలేక జీవచ్చవంలా బతుకుతున్నారు. గీతన్నల శరీరం ఓదెబ్బల కొలిమై, వారిచేతులు నెర్రెళువారి పగుళ్ళుతో ఉంటాయి. వృత్తిచేసేవారి కుటుంబాలలో బాధలు వర్ణాతీతం. మరణించిన వారు ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి బతుకులు ఆగం అయినవారు కొందరైతే వికలాంగులుగా మారినవారు మరికొందరు. అవిటివాళ్ళుగా మారి అనాదలైనవారు మారేందరో ఉన్నారు.బతుకు భరోసా అయిన భర్త లను కోల్పోయి వితంతువులు మరికొందరు ఇలా ఎన్నో ఇబ్బందుల నడుమ గీతకార్మికుల సతమతవుతూన్నారు. అనాదిగా వస్తున గీతవృత్తిని సవ్యంగా చేసుకునే విధంగా చూసి కొత్త ప్రభుత్వము వృత్తి రక్షణ కల్పించాలి. ప్రతి గౌడసొసైటికి 10 ఎకరాల భూమిని కేటాయించి తాటి,ఈత వనాల పెంపకానికి నీటివసతి కల్పించాలి. హైబ్రీడ్‌ తాటి, ఈతచెట్లు ఉచితంగా పంపిణీ చేయాలి. గీతకార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే పదిలక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలి. ప్రతి గీతకార్మికునికి వృత్తిపరంగా 5000 రూపాయలపింఛన్‌ ఇవ్వాలి. గీతకార్మికులకు టూవీలర్‌ వెహికల్స్‌ ఇచ్చి ఆదుకోవాలి.నీరాస్టాల్‌ ఏర్పాటు చేసి వాటికి గౌడకులస్థులను భాగస్వామ్యులను చేయాలి. గౌడ నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పించాలి. గౌడకార్పోరేషన్‌ ఏర్పాటు చేసి గౌడ యువతకు చేయూతనివ్వాలి. ప్రభుత్వాలు మారాయి నాయకులు మారినారు.. కానీ తరాలుమారిన గీతన్నల తలరాతలు మారలే. ఇప్పటికైన కొలువు తీరిన కొత్త ప్రభుత్వం గౌడన్నల పట్ల చిత్తశుద్దితో వారి మొరలను ఆలకించి గీతకార్మికుల బతుకులు బాగుకై, సంక్షేమానికై సమగ్రమైన కార్యచరణ చేస్తారని కోరుకుందాం. గౌడ అస్తిత్వామూలాలను ప్రభుత్వము కాపాడాలని గీతాకార్మికులను అన్ని విధాలుగా ఆధుకోవాలి.


కామిడి సతీశ్‌ రెడ్డి,
తెలంగాణ సామాజిక రచయితల
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, 9848445134.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు