Wednesday, April 17, 2024

వికారాబాద్‌ లో మహిళా దారుణ హత్య..!

తప్పక చదవండి
  • పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు
  • ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు

వికారాబాద్‌ : దారుణంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసిన సంఘటన వికారాబాద్‌ జిల్లా గ్రామం పుల్‌ మద్ది శివారు పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్‌ మండలం పులుమద్ది అడవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (30) మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు మహిళను గుర్తుపట్టని విధంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌ తో, జాగిలాలతో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గుర్తు తెలియని మహిళ హత్యకు ముందు ఆమెను అత్యాచారం చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహం గుర్తు పట్లకుండా ఒంటి పై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు.. మృతదేహాం వద్ద ఆకు పచ్చ జాకెట్‌ పచ్చని కలర్‌ చీర లభించింది. ఆమె వయస్సు దాదాపు 30, నుండి 35 సంవత్సరాలు ఉంటుందని సంఘటన జరిగి రెండు రోజులు జరిగి ఉండవచ్చు అని పోలీసులు అ నుమానిస్తున్నారు. వికారాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

కలకలం రేపిన మహిళ హత్య…

- Advertisement -

వికారాబాద్‌ జిల్లా పులుమద్ది సమీపంలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురయిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యవసాయ పొలాల్లో పనులకు వెళ్లే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.హైదరాబాద్‌
శివారు మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వరుసగా మహిళల మృతదేహాలు లభించడం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఇబ్రహీంపట్నం, సూరారం, మొయినాబాద్‌ పరిధిలో మహిళల మృతదేహాలు లభించడం గమనార్హం. వికారాబాద్‌ లో మొన్న ఓ మహిళ మృతదేహం లభించగా, అవతలి మొన్న కుల్కచర్లలో మహిళ పుర్రె లభ్యమైంది. కాగా మొయినాబాద్లో యువతి మృతికేసులో ఆమె సూసైడ్‌ చేసుకుందని పోలీసులు తేల్చి చెప్పారు.వికారాబాద్‌ లోని పులు మద్ధి మహిళ హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టడం జరిగిందని,మహిళకు తెలిసిన వాళ్ళే హత్య చేసి ఉంటారని డిఎస్పీ నర్సింహులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు