Thursday, May 16, 2024

35 ఓవర్లలో న్యూజిలాండ్‌ స్కోర్‌…. ?

తప్పక చదవండి

హైదరాబాద్‌ : క్రికెట్ ప్రపంచక్‌ప్‌ – 2023లో భాగంగా సోమవారం న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్నది. నెదర్లాండ్స్‌ టాస్‌ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్‌ బ్యాటర్‌లు నిలకడగా ఆడుతూ చాపకింద నీరులా పరుగులు రాబడుతున్నారు. దాంతో 35 ఓవర్ల ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బ్యాటర్‌లలో విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్రలు అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకుముందు కివీస్‌ ఓపెనర్‌లు డెవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. అయితే జట్టు స్కోర్‌ 67 పరుగులు ఉన్నప్పుడు కాన్వే (32) వాన్‌ డెర్‌ మెర్వ్‌ బౌలింగ్‌లో బాస్‌ డీ లీడెకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రచిన్‌ రవీంద్ర.. విల్‌ యంగ్‌తో కలిసి చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టు స్కోర్‌ 144 పరుగులు ఉండగా విల్‌ యంగ్‌ 70 (7 ఫోర్లు, 2 సిక్సర్‌లు) వాన్‌ మీకెరెన్‌ బౌలింగ్‌లో బాస్‌ డీ లేడేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత 185 పరుగుల వద్ద రచిన్‌ రవీంద్ర 51 (3 ఫోర్లు, 1 సిక్సర్‌) వాన్‌ డెర్‌ మెర్వ్‌ బౌలింగ్‌లో ఎడ్వర్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 32.2 ఓవర్లలో న్యూజిలాండ్‌ స్కోర్‌ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులకు చేరింది. 35 ఓవర్లు ముగిసేటప్పటికి మరో 13 పరుగులు జోడించి స్కోర్‌ను 198కి చేర్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు