- సొంతగూటికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన
రాహుల్ గాంధీ, పీసీసీఅధ్యక్షులు రేవంత్ రెడ్డి
షాద్ నగర్ : షాద్నగర్ కాంగ్రెస్ లో నయా జోష్ మొదలైంది మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తోపాటు అధికార పార్టీ జెడ్పిటిసిలు వెంకట్రామిరెడ్డి, తాండ్ర విశాలా శ్రావణ్ రెడ్డి ఫరూక్ నగర్ మండల మైనార్టీ నాయకుడు జమ్రుత్ ఖాన్ కొత్తూరు మాజీ జెడ్పిటిసి శ్యామ్ సుందర్ రెడ్డి క్రాంతి రెడ్డి సుదర్శన్ గౌడ్ మధురాపురం ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి షాద్ నగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శ్రావణి పలువురు సర్పంచులు ఎంపిటిసిలు నాయకులు వైయస్సార్సీపి తెలంగాణ నాయకురాలు రమాదేవి రాహుల్ గాంధీ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.చౌల్లపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతు ఇప్పుడు నా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది అని బిఆర్‌ఎస్ పార్టీలో నాకు గౌరవం ఇవ్వలేదని మమ్మల్ని త్రీవ అవమానాలు గురి చేశారని పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా ఒంటెద్దు పోకడలకు పోయారని నేను బిఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చాలా అవమానాలకు గురిచేసారని వాపోయారు కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం కృషి చేస్తానని షాద్ నగర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు వెళ్లి ప్రచారం మొదలుపెట్టి నాకు కావలసిన కార్యకర్తలను నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వస్తానని జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని కార్యకర్తలు నాయకులు ఎవరు భయపడే అవసరం లేదని అన్నారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను వీర్లపల్లి శంకర్ అండగా ఉంటామని అన్నారు ఫరూక్నగర్ జెడ్పిటిసి మాట్లాడుతూ నేను మొదటి దశ ఉద్యమ కాలం నుంచి బి ఆర్ స్ ఉన్నాను ఫరూక్నగర్ మండల ప్రజలు నాపై విశ్వాసముంచి జడ్పిటిసి గా ఎన్నుకున్నారు అని మేము ఏ పని చేయాలన్నా మమ్మల్ని అడ్డుకోవడం నా మండలం లో నాకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడం నన్ను పిలవకపోవడం నన్ను చాలా బాధించాయి ఉద్యమ సమయంలో షాద్ నగర్ నియోజకవర్గం లో సింగిల్ నెంబర్ నాయకులు తప్ప అప్పుడు ఎవరున్నారు కొంతమంది నాయకులం ఎంతో కష్టపడి బిఆర్‌ఎస్ పార్టీని ముందుకు నడిపించామని అటువంటి పార్టీని విడువవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదని గుండె బరువుతో పార్టీని వీడుతున్నామని చెప్పారు ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరామని చెప్పారు.
కేశంపేట జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ నేను మా మామగారైన తాండ్ర వీరేందర్ రెడ్డి ఆశయంతో రాజకీయాల్లో కొచ్చానని నా వలన పేద ప్రజలకు సేవ చేయాలని బిఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చానని ఎంతో ఆశయంతో వచ్చిన నాకు నా ప్రజలు కేశంపేట జెడ్పిటిసి గా ఎన్నుకున్నారని నా పరిధిలోని పనులకు చేయడానికి వెళితే నన్ను కట్టడి చేయడం ఏ పని చేయాలన్నా పర్మిషన్ తీసుకోవడం అంటే ఎలా నన్ను ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బంది పెట్టారని ఎవరైనా ఆపదలో ఉంటే నా వంతు సహాయం చేస్తే కూడా ఎందుకు చేశారు అని నన్ను నిల దీయడం నన్ను అవమానాలు గురి చేయడం వల్ల నా మనస్సాక్షిని చంపుకొని పార్టీలో ఉండలేక పార్టీని వీడి వెళుతున్నాను ఇప్పుడు నా గుండె బరువు దిగినట్టు ఉందని అన్నారు ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జీవితంలో మర్చిపోలేనని అన్నారు కొత్తూరు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ నేను ఇంతకుముందు అంజయ్య యాదవ్ గెలుపు కోసం చాలా కష్టపడ్డానని మా కొత్తూరు మండలంలో జెడ్పిటిసి,ఎంపీటీసీలను సర్పంచ్లను వార్డు సభ్యులను గెలిపించుకున్నామని ఎంతో కష్టపడ్డ మాకు పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టి మా కష్టానికి గుర్తించకుండా అవమానాల గురిచేసారని అన్నారు ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కు మా కొత్తూరు మండలంలో భారీ మెజార్టీ తెస్తామని అన్నారు యువ నాయకుడు క్రాంతి రెడ్డి మాట్లాడుతూ నేను కొత్తూరు మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని బిఆర్‌ఎస్ పార్టీ కోసం కష్టపడ్డానని నాకు తగిన గుర్తింపు లేదు పైగా మమ్మల్ని చిన్నచూపు చూడడం అవమానాల గురి చేయడం వల్ల పార్టీని విలువ వలసి వచ్చింది ఇప్పుడు ప్రతాప్ రెడ్డి అన్న శ్యామ్ సుందర్ రెడ్డి అన్న వెంట నడుస్తానని అన్నారు షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మైనార్టీ నేత జమ్రుత్ ఖాన్ షాద్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రావణి వైఎస్‌ఆర్సిపి నాయకురాలు రమాదేవి కొత్తూరు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి కొత్తూరు మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్ క్రాంతి రెడ్డి మరియు పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు నాయకులకు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా అందరికీ పేరుపేరునా ధన్యవాదములు అని అన్నారు మీ అందరి సహకారంతో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు మాపై విశ్వాసం ఉంచి మా పార్టీలోకి వచ్చిన,వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదములు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.