Wednesday, May 8, 2024

వన్డే వరల్డ్‌ కప్‌ లో సరికొత్త చరిత్ర…

తప్పక చదవండి

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగున్నర దశాబ్దాలుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో తొలిసారిగా ఓ ఎడిషన్‌లో ఐదు వందల సిక్సర్లు నమోదయ్యాయి. పవర్‌ ప్లే నిబంధనలు, ఆఖర్లో ధాటిగా ఆడుతూ బ్యాటర్లు వీరబాదుడు బాదుతుండటంతో పాత సిక్సర్ల రికార్డులు మాయమయ్యాయి. ఇంకా లీగ్ దశ కూడా ముగియకముందే 40 మ్యాచ్‌లలోనే 500 సిక్సర్లు నమోదుకావడం గమనార్హం. వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌ – నెదర్లాండ్స్‌ మధ్య పూణె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మలన్‌ రెండు సిక్సర్లు బాదడంతో ఈ ఎడిషన్‌లో 500 సిక్సర్లు పూర్తయ్యాయి. ఇంతకుముందు 2015 వరల్డ్‌ కప్‌లో 48 మ్యాచ్‌లలో 463 సిక్సర్లు నమోదవడమే ఇప్పటివరకూ హయ్యస్ట్‌. గత వరల్డ్‌ కప్‌లలో నమోదైన సిక్సర్ల జాబితాను పరిశీలిస్తే.. 2019లో 357 సిక్సర్లు (51 మ్యాచ్‌లు) నమోదుకాగా 2015లో 48 మ్యాచ్‌లలో 463, 2011లో 49 మ్యాచ్‌లలో 258 సిక్సర్లు నమోదయ్యాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు