Wednesday, May 1, 2024

సైమా అవార్డుకు ఎంపికైన యువహీరో శ్రీకాంత్ రెడ్డి..

తప్పక చదవండి

హైదరాబాద్ : సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ( సైమా ) కు ఎంపికైనట్లు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాతో అరంగ్రేట్రం చేసిన యువ హీరో శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.. ఆనాడు స్వాతిముత్యం, శంకరాభరణం, ఆపత్బాంధవుడు వంటి అపురూప చిత్రాల్లో కమల్ హాసన్, చిరంజీవి నటించగా ఈ ఆణిముత్యాలు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన కళాతపస్వి కె. విశ్వనాథ్, పూర్ణోదయా పిక్చర్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావుల సారధ్యంలో ఈ చిత్రాలను అందించారు.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఆల్వాల్ డివిజన్, కౌకూర అనే చిన్న గ్రామంలో పుట్టి, సినిమాపై మోజుతో ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా స్వయంకృషి, పట్టుదలతో ఎదిగి, తొలిపరిచయంతోనే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలో నటనకు బెస్ట్ డెబ్యూటెంట్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సైమా అవార్డుకు ఎంపిక కావటం పట్ల కౌకూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ, శ్రీజ ఎంటర్టైన్ మెంట్ పతాకం, పూర్ణోదయా పిక్చర్స్ ఉమ్మడి బ్యానర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాను నిర్మించారు.. దిల్ రాజు తమ్ముడి తనయుడు ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయిస్, అశోక్ గల్లా హీరో మూవీ, బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం, హర్ష కనుమూలి సెహారీ, శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ డే ఫస్ట్ షో మొత్తం తొలిపరిచయంలోనే ఈ అవార్డును దక్కించుకున్నట్లు హీరో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.. ఈ చిత్రానికి కథ జాతి రత్నాలు ఫెమ్ అనుదీప్ కేవీ, దర్శకత్వం వంశీ, లక్ష్మి, మ్యూజిక్ డైరెక్టర్ గా రధన్ లు బాధ్యతలు నిర్వహించారు.. 2023 గాను సైమా అందించబోయే అవార్డుల ఉత్సవాల్లో పాల్గొని మరిన్ని చిత్రాల్లో నటించి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్నేహితులు, తోటి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఆకాంక్షిస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు