Sunday, July 21, 2024

తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి సాధన కోసమే నా స్వచ్ఛంద పదవీ విరమణ..

తప్పక చదవండి
  • వెల్లడించిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్..

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, చివరికి దళితుడు సైతం ముఖ్యమంత్రి పదవి పొందారని.. 52 శాతం ఉన్న బీసీలు ఒకసారి కూడా ముఖ్యమంత్రి కాలేదని.. తెలంగాణ రాష్ట్రంలోనూ వెలమ సామాజిక వర్గం గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారని.. 2023లోనే బీసీ ముఖ్యమంత్రిని సాధించడానికి నేను స్వచ్ఛంద పదవి విరమణ చేశానని ఉస్మానియా తెలంగాణ విశ్వవిద్యాలయాల మాజీ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు.. బుధవారం ఉస్మానియా న్యాయ కళాశాల ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు న్యాయ కళాశాలల ప్రిన్సిపాల్స్, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా వినోద్ కుమార్ ను సన్మానించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగం ద్వారా ఆశించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 10 శాతం కూడా అమలు కాలేదని, మిగిలిన 90 శాతం అమలుకోసం నా స్వచ్ఛంద పదవి విరమణ అనంతరం ఉద్యమం కొనసాగిస్తానని, ముందుగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం కలిసివచ్చే కుల, ప్రజా సంఘాలు, పార్టీలతో కలిసి ఉద్యమిస్తానని ఆయన తెలిపారు.. ఈ సన్మాన సభకు న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాధిక యాదవ్, సీనియర్ ప్రొఫెసర్ జిబి రెడ్డి హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా ప్రొఫెసర్ ఎన్ వెంకటేశ్వర్లు, బివైఎస్ చైర్మన్ డాక్టర్ అపర్ణ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనురాధతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తల్లి గాలి అక్కమ్మ, భార్య గాలి చంద్రకళ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరై ఆయనను అభినందించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు