Saturday, May 18, 2024

ఉపాధ్యాయుల హాజరుపై నజర్ ఏది..?

తప్పక చదవండి
  • చెన్నారెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది ఇద్దరు టీచర్లు
  • ఇష్టం వచ్చినప్పుడల్లా డుమ్మాలు కొడుతున్న వైనం..
  • ఎప్పుడంటే అప్పుడు పాఠశాలను మూసివేసే టీచర్లపై చర్యలు తీసుకోవాలి..

హన్మకొండ : తరచూ విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ డాక్టర్స్ కాలనీ చెన్న రెడ్డి నగర్ వాసులు పలువురు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. చెన్నా రెడ్డి నగర్ మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలో దాదాపు గా 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలకు పూర్తిస్థాయి ఉపాధ్యాయులు లేకపోవడంతో, ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులతో ఆ పాఠశాలను నడిపిస్తున్నారు . ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు శ్రీనివాస్, జోసఫ్ లు వారికి ఇష్టం వచ్చిన రోజులలో వచ్చి.. ఇద్దరు అవగాహనా ఒప్పందంతో పాఠశాలకు హాజరవుతారని.. తూతూమంత్రంగా విద్యార్థులకు పాఠాలు చెబుతూ.. వారికి ఇష్టం వచ్చినప్పుడు పాఠశాలను మూసివేసి ఇంటికి వెళ్తారని పలువురు పేర్కొన్నారు. ఇదే విషయంపై పాఠశాల యొక్క స్థితిగతులు, ఉపాధ్యాయుల డుమ్మా గురించి తెలుసుకోవడం కోసం మధ్యాహ్నం 3: 20 నిమిషాలకి పాఠశాలకు వెళ్లగా అప్పటికే పాఠశాల మూసివేసి.. పిల్లలను ఇంటికి పంపించేసి.. ఉపాధ్యాయులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇదే విషయంపై పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ కి ఫోన్ చేసి అడగగా నేను ఎంఈఓ ఆఫీసుకెళ్లానని ఇక్కడికి రండి మాట్లాడదామని బదులిచ్చారు. ఎంఈఓ కార్యానికి వెళ్లగా అక్కడ శ్రీనివాస్ అందుబాటులో లేరు.. కొద్దిసేపటి తరువాత వచ్చి పొంతనలేని సమాధానం చెబుతూ మీడియా ప్రతినిధులనే దబాయించారు. మరో ఉపాధ్యాయుడు జోసెఫ్ గైర్హాజరు గురించి ప్రశ్నించగా ఆఫ్ డే లివ్ పెట్టుకొని వెళ్లిపోయారని, ఈ విషయం గురించి నాకు పూర్తి సమాచారం తెలియదని అన్నారు. ఉన్నదే ఇద్దరు ఉపాధ్యాయులు ఇద్దరూ వారికి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడం పై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పిల్లలకు విద్యాబోధన సరిగా చేయనప్పుడు ఎలా ప్రయోజకులవుతారని విచారం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని బస్తిలలో పరిస్థితి ఇలా ఉంటే, గిరిజన గ్రామాలలో, గూడెంలలో పరిస్థితి ఏవిదంగా ఉంటుందో అర్ధం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, పాలకులు వరంగల్ నగరంలోని చెన్నరెడ్డి నగర్ వంటి పాఠశాలపై దృష్టి పెట్టనప్పుడు, గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ విద్యా విధానం ఏవిదంగా ఉంటుందో అర్ధం చేసుకోవాలి.. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, చెన్నారెడ్డి నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయంపై మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు