Wednesday, May 8, 2024

కవితది లిక్కర్‌ బోర్డు రాజకీయం

తప్పక చదవండి
  • తనది పసుపుబోర్డు తెచ్చిన ఘనత
  • బిఆర్‌ఎస్‌ అవినీతికి పట్టం కట్టింది
  • వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు సమా
  • ముత్యంపేట షుగర్‌ ఫ్యక్టరీ తెరిపిస్తా: ఎంపి అర్వింద్‌

జగిత్యాల : బీఆర్‌ఎస్‌ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనవిూద లేదని, ఉండదని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. కవిత లిక్కర్‌ బోర్డులో ఘనురాలని, తాను పసుపు బోర్డు తీసుకుని వచ్చి రైతులకు ప్రయోజనం చేకూర్చానని అన్నారు. శుక్రవారం ఆయన మెట్‌పల్లిలో మాట్లాడుతూ దలారి వ్యవస్థను పెంచింది కాంగ్రెస్‌ అని, రాజకీయంగా కవిత తనను అందుకోలేరని అన్నారు. కవిత లిక్కర్‌ బోర్డు తెస్తే.. తాను పసుపు బోర్డు తీసుకువచ్చానని అన్నారు. పసుపు రైతుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి నేత ఆచారి తదితరులు పాల్గొన్నారు. ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ తాళలు తెరిపిస్తానని ఎంపిస్పష్టం చేశారు. ఇందూర్‌ పార్లమెంట్‌లో హుందాతనం రావాలని ధర్మపురి అరవింద్‌ అన్నారు.హయాంలో పసుపు బోర్డు రావడం శుభ పరిణామం అని అన్నారు. పసుపు బోర్డు ప్రకటనతో రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రైతుల శ్రేయస్సు, సామర్థ్యాలు మనకు ముఖ్యం అని మోదీ అన్నారు. పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ఏమైనా చేస్తాం.. ఎంతవరకైనా వెళ్తాం అని ప్రకటించారు. పసుపు బోర్డు వల్ల ఇన్ఫాస్టక్చర్ర్‌ పెరుగుతుంది.‘ అని తెలిపారు. కవిత.. కేసీఆర్‌ పేరు నిలబెట్టి లిక్కర్‌ బోర్డు తెచ్చారు. మోదీపై.. కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితం. మోదీని ప్రపంచం కీర్తిస్తుంది. కేటీఆర్‌, కవిత ఉద్యమంలో లేరు. ఎక్కడి నుంచో వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్తుంది. విూ చెల్లెల కంటే ముందే కేటీఆర్‌ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. కేటీఆర్‌ ప్రధాని గురించి మాట్లాడేముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నుంచే మార్పు మొదలవుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం. చాలా చోట్ల పసుపు రైతు సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఆశీర్వాద తీర్మానాలు చేస్తున్నారు. నిజామాబాద్‌లో జరిగే ప్రధాని సభకు పసుపు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నామని అర్వింద్‌ చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయడంతో ఇందూరు రైతుల కల నెరవేరిందని అన్నారు. పసుపు బోర్డు కోసం ఇందూరు రైతులు జిల్లా నుంచి ఢల్లీి వరకు ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. కానీ, రైతుల కష్టాన్ని గుర్తించిన ప్రధాని మోదీ వారి ఆశలను నెరవేర్చారని చెప్పారు. పసుపు రైతులు అందరికీ ఈ బోర్డు ఉపయోగపడుతుందన్నారు. ఇందూరు ప్రజలు ఇచ్చే తీర్పుతో బీఆర్‌ఎస్‌ పునాదులు కదలనున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ తప్పుడు హావిూలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హావిూలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పి బీజేపీకి పట్టం కట్టడం ఖాయం అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత లోక్‌సభ ఎన్నికలప్పుడు ఇచ్చిన హావిూని ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. పసుపు రైతుల కోసం ప్రధాని మోదీ పసుపు బోర్డును ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. కేంద్రం రూ.లక్షల కోట్లను రాష్టాన్రికి ఇస్తే బీజేపీ ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతి ఎక్కడ బయటపడుతుందనే భయంతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల డీపీఆర్‌లను రాష్ట్రం కేంద్రానికి పంపడం లేదని ఆరోపించారు. ఎన్నికల కోసమే పాలమూరు పథకం విషయంలో కేసీఆర్‌ హడావిడి చేస్తున్నారనిఆరోపించారు. ప్రాజెక్టు పనులు పూర్తికాకముందే ట్రయల్‌రన్‌ చేపట్టి రైతులను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని కేసీఆర్‌.. ఎన్నికలు వచ్చినప్పుడు వరాలు ప్రకటించి మాయ చేస్తుంటారని ధ్వజమెత్తారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు